కోమటిరెడ్డి ఆంధ్రా కాంట్రాక్టర్ల రచ్చ..! తలసాని రాజీనామా సవాల్-ఏపీ బీజేపీ పంచ్ లు..!
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం చినికి చినికి గాలివానగా మారి పవన్ కళ్యాణ్ పై తెలంగాణ వ్యతిరేకత వరకూ రాగా.. నిన్న పవన్ ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపడేశాయి. ముఖ్యంగా ఆంధ్రా కాంట్రాక్టర్లు (Andhra Contractors) కావాలి కానీ అక్కడి నేతల్ని మాత్రం హైదరాబాద్ రావొద్దంటారా అంటూ పవన్ వేసిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా స్పందించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లను బ్యాన్ చేస్తామని, వారికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వబోమని ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ ఘాటుగా స్పందించాయి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇవ్వకుండా చట్టం తెస్తానన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడుతూ... మీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ చట్టం తెస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. నీకు దమ్ముటే నువ్వు రా అన్నారు. ఈ ప్రభుత్వం ఏ మాటా నిలబెట్టుకునే పరిస్ధితి లేదన్నారు. కేవలం అడ్డగోలు మాటలు మాత్రమే మాట్లాడుతున్నారన్నారు.

మరోవైపు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి గారు,అప్పులు అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నారు, టెండర్లు అంతర్జాతీయంగా పిలుస్తున్నారు, కానీ మీరు మాత్రం 'ఆంధ్రా వారికి కాంట్రాక్టులు ఇవ్వం' అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలపై అవగాహన లేక మాట్లాడుతున్నారా? లేక రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ మారదా ? అంటూ పంచ్ లు వేశారు.












Click it and Unblock the Notifications