ఆరుపదుల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి.. ఆ స్టార్ హీరో ఎవరంటే..?

సెలబ్రిటీల లైఫ్ ఎప్పుడూ తెరిచిన పుస్తకం లాగే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, డేటింగ్, విడాకులు కామన్ గానే వినిపిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముచ్చటగా మూడోపెళ్లికి సిద్ధమయ్యారు. ఆరు పదుల వయసులో ఉన్న అమీర్ ఖన్.. ఈ ఏడాది జులై 5 న తన గర్ల్ ఫ్రెండ్ బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో అమీర్ ఖాన్- గౌరీ ల వివాహంపై క్లారిటీ వచ్చింది.

అయితే ఎలాంటి ఆడంబరాలు లేకుండా అతి తక్కువ మంది ప్రముఖుల మధ్య వీరి వివాహం జూలై 5న జరగనుంది. ఇరు కుటుంబాల సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఇక అమీర్ ఖాన్- గౌరీ స్ప్రాట్‌ ల మధ్య దాదాపు 25 సంవత్సరాలకు పైగా ఫ్రెండ్ షిప్ ఉంది. అయితే గత రెండేళ్లుగా వీరు డేటింగ్ లో ఉన్నారు. ఇక గతేడాది తన 60 వ బర్త్ డే సందర్భంగా అమీర్ ఖాన్.. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్ ను అధికారికంగా పరిచయం చేశారు.

ఇక అమీర్ ఖాన్ కు ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయి. అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాను 1986 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాల వివాహం తర్వాత 2002లో విడిపోయారు.

AamirKhan to Marry Gauri Spratt on July 5th Bollywood Icon Ready for His Third Marriage AamirKhan

ఆ తర్వాత అమీర్ ఖాన్ 2005 లో కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. ఆ తర్వాత అమీర్ ఖాన్- కిరణ్‌ రావు 2021లో విడిపోయారు. ఇద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంలో జరిగే ఈవెంట్లకు అమీర్ ఖాన్ హాజరవుతున్నారు. విడిపోయిన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వక రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే కుమారుడు ఆజాద్ బాధ్యతలను ఇద్దరూ చూసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+