వీర గంగాధర అజ్జయ్య సాక్షిగా.. !!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకకు 25వ ముఖ్యమంత్రి అయ్యారు. బెంగళూరులోని లోక్ భవన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డీకేశితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు.
ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా కొనసాగుతోంది. ప్రమాణ స్వీకార సమయంలో డీకే శివకుమార్ చేతిలో రాజ్యాంగ ప్రతి కనిపించింది. రాజ్యాంగం సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారానికి తన పేరును పిలవగానే భావోద్వేగానికి గురయ్యారు డీకేశి. కుర్చిలో నుంచి లేచి వేదిక మీద సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం మైక్ వద్దకు వెళ్లారు. కన్నడంలో ఆయన ప్రమాణ స్వీకారం కొనసాగింది. వేదిక వద్ద ముందు వరుసలో కూర్చున్న డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్, కుమార్తె సైతం ఎమోషన్ అయ్యారు. తండ్రి ప్రమాణ స్వీకారం చేస్తోన్న సమయంలో కుమార్తె కంట్లో తడి కనిపించింది.
ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారాయన. వివిధ మఠాధిపతులు, ముస్లిం మతపెద్దలు, క్రైస్తవ మిషనరీ ఫాదర్ల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. డీకే శివకుమార్ సొంత నియోజకవర్గం కనకపుర నుంచి వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సహా రాహుల్ గాంధీ స్థాయి సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో లోక్ భవన్ లో కోలాహలం నెలకొంది.
ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ముందుగానే ఈ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు. వీఐపీల తాకిడి అధికంగా ఉన్నందున.. విధాన సౌధ నుంచి లోక్ భవన్, బ్రిగేడ్ రోడ్, ఇందిరానగర్ రోడ్.. వంటి రోడ్ల పొడవునా పోలీసులను మోహరింపజేశారు. ఈ కార్యక్రమం కోసం 2,000 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం డీకే శివకుమార్ లోక్ భవన్ నుంచి ఓపెన్ టాప్ జీప్ లో విధాన సౌధకు ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications