జమిలి ఎన్నికలు 2027 లోనేనా - ఢిల్లీ లేటెస్ట్ అప్డేట్..!!
కేంద్ర రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కేంద్రం జమిలి ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రోజు పార్లమెంట్ ముందుకు జమిలి బిల్లు ప్రవేశ పెట్టాలని తొలుత కేంద్రం నిర్ణయించింది. కానీ, చివరి నిమిషంలో ఆలోచన మారింది. అయితే..తాము వెనక్కు వెళ్లిన ట్లు కాదని కేంద్రం చెబుతోంది. వ్యూహంలో భాగమని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో బిల్లు ఆమోదం దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఇక..జమిలి ఎన్నికల నిర్వహణ పైన కేంద్రం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
జమిలి బిల్లుల వేళ
జమిలి ఎన్నికల నిర్వహణ కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలనే ఆలోచనతో ఉంది. ఈ రోజు బిల్లు ఉపసంహరణ వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 20వ తేదీతో పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలు ముగియనున్నాయి. ఈ లోగానే బిల్లును ప్రవేశ పెడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్ సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబం ధించిన రెండు బిల్లులను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. ఈ రోజు బిల్లులను సభ ముందుకు తీసుకురావాల్సి ఉన్నా..లిస్టు నుంచి ఉప సంహరించుకోవటంతో రేపు లేదా బుధవారం బిల్లులు ప్రవేశ పెడతారనే అంచనాలు మొదలయ్యాయి.

కేంద్రం తాజా వ్యూహం
కేంద్రం ఆమోదించిన రెండు బిల్లుల్లో మొదటిది.. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, రెండోది శాసనసభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు. ఉభయ సభల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టిన తరువాత పరిస్థితికి అనుగుణంగా అవరమైతే జేపీసీకి బిల్లు పంపాలనేది బీజేపీ ముఖ్య నేతల సమాచారం. అయితే, జమిలి కోసం మొత్తం ఆరు బిల్లుల ను ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ, కేంద్రం ప్రస్తుతానికి రెండు వరకే పరిమితం అయింది. బిల్లుల ఆమోదానికి ఉభయ సభల్లో బలం పైన బీజేపీ ఫోకస్ చేసింది. జమిలి బిల్లుపై వీలైనన్ని పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
ఎన్నికలు ఎప్పుడు
కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో అసలు జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్రం ప్రతిపాదించి ఉప సంహరించుకున్న బిల్లులో కీలక అంశాలను ప్రస్తావించింది. వీటి ఆధారంగా జమిలి ఎన్నికలు 2034లోనే సాధ్యపడతాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. అదే విధంగా సాంకేతికంగా ప్రస్తావించిన అంశాలతో 2027 లేదా కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారితే 2029 లో జరిగే ఛాన్స్ ఉంటుందనేది మరో వాదన. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన కసరత్తు చాలా ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో, సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తరువాతనే ఎన్నికల నిర్వహణ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications