Wife: ఇనుప రాడ్ తో భార్యను చితకబాది చంపేసిన భర్త, బయట వ్యాపారం, ఇంట్లో అనుమానంతో, చివరికి!

లక్నో/ప్రయోగ్ రాజ్: హ్యాపీగా సంసారం చేసిన దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. పిండి మిల్లు నిర్వహిస్తున్న భర్త రోజూ వ్యాపారం చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు, కొడుకును చూసుకునే బాధ్యతను భార్యకు అప్పగించిన భర్త అతని పని అతను చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. ఇదే సమయంలో భార్య తీరుతో భర్తకు అనుమానం పెరిగిపోయింది. కొంతకాలంగా దంపతుల మద్య పదేపదే ఇదే విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి.

తల్లిదండ్రులను వారి పిల్లలే బుద్దిచెబుతూ వచ్చినా వారు మాత్రం మారలేదు. ఇంట్లో రాత్రి పిల్లలు ఎవరి గుదుల్లో వారు నిద్రపోయారు. వేకువ జామున ఇనుప రాడ్ తీసుకున్న భర్త అతని భార్య మీద పదేపదే దాడి చేసి చితకబాది దారుణంగా కొట్టి చంపేశాడు.

దంపతులకు ముగ్గురు పిల్లలు

దంపతులకు ముగ్గురు పిల్లలు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ సమీపంలోని దారాగంజ్ ప్రాంతంలో బాలా శ్యామ్ (49) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 1999లో రష్మీ యాదవ్ అనే మహిళను బాలా శ్యామ్ వివాహం చేసుకున్నాడు. బాలా శ్యామ్, రష్మీ యాదవ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. బాలా శ్యామ్, రష్మీ యాదవ్ కుమార్తెలు ఇద్దరూ కాలేజ్ లో చదువుతున్నారు.

వ్యాపారం చేస్తున్న భర్త

వ్యాపారం చేస్తున్న భర్త

దారాగంజ్ ప్రాంతంలో బాలా శ్యామ్ సొంతంగా పిండి మిల్లు నిర్వహిస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు పిండి మిల్లులో బాలా శ్యామ్ బిజీబిజీగా ఉంటున్నాడు. పిండి మిల్లు నిర్వహిస్తున్న బాలా శ్యామ్ రోజూ వ్యాపారం చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు, కొడుకును చూసుకునే బాధ్యతను బాలా శ్యామ్ అతని భార్య రష్మీ యాదవ్ కు అప్పగించి అతని పని అతను చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు.

భార్య మీద అనుమానం పెరిగిపోయింది

భార్య మీద అనుమానం పెరిగిపోయింది

కొన్ని సంవత్సరాల నుంచి భార్య రష్మీ యాదవ్ తీరుపై ఆమె భర్త బాలా శ్యామ్ కు అనుమానం వచ్చింది. భార్య రష్మీ యాదవ్ తీరుతో ఆమె భర్త బాలా శ్యామ్ కు గత ఏడాది నుంచి ఇంకా అనుమానం పెరిగిపోయింది. కొంతకాలంగా బాలా శ్యామ్, రష్మీ యాదవ్ దంపతుల మద్య పదేపదే ఇదే విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. తల్లిదండ్రులకు వారి పిల్లలే బుద్దిచెబుతూ వచ్చినా వారు మాత్రం మారలేదు.

రాత్రి గొడవ పడ్డారు

రాత్రి గొడవ పడ్డారు

రాత్రి పిండి మిల్లులో వ్యాపారం ముగించుకున్న బాలా శ్యామ్ ఇంటికి వెళ్లాడు. తరువాత పాత విషయంలోనే బాలా శ్యామ్, రష్మీ యాదవ్ మద్య గొడవ మొదలైయ్యింది. ఆ సమమంలో అసహనం వ్యక్తం చేసిన కూతుర్లు భోజనం చెయ్యకుండా వెళ్లి నిద్రపోయారు. తరువాత రష్మీ యాదవ్, ఆమె భర్త బాలా శ్యామ్ వేరువేరుగా నిద్రపోయారు.

భార్యను ఇనుపరాడ్ తో కొట్టి చంపేసిన భర్త

భార్యను ఇనుపరాడ్ తో కొట్టి చంపేసిన భర్త

వేకువ జామున నిద్రలేచిన భర్త బాలా శ్యామ్ తరువాత అతని భార్య రష్మీ యాదవ్ తో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన బాలా శ్యామ్ ఇనుపరాడ్ తీసుకుని అతని భార్య రష్మీ యాదవ్ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. కూతుర్లు, చుట్టు పక్కల వాళ్లు రష్మీ యాదవ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రష్మీ యాదవ్ చనిపోయిందని పోలీసులు చెప్పారు. రష్మీ యాదవ్ ను హత్య చేసిన బాలా శ్యామ్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+