తెల్లవారుజామున!.. శృంగారం కోసం భర్త ఒత్తిడి, మర్మాంగం కోసేసిన భార్య..
శృంగారం విషయంలో భార్యతో తలెత్తిన వివాదం భర్త మర్మాంగాలు కోసేదాకా వచ్చింది. తమిళనాడులోని గుడియాత్తం సమీపంలో ఉన్న లింగుండ్రం కన్నియప్పనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వేలూరు: శృంగారం విషయంలో భార్యతో తలెత్తిన వివాదం భర్త మర్మాంగాలు కోసేదాకా వచ్చింది. తమిళనాడులోని గుడియాత్తం సమీపంలో ఉన్న లింగుండ్రం కన్నియప్పనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జగదీశన్-సరస్వతి అనే దంపతులు కన్నియప్పన్ నగర్‌లో నివాసముంటున్నారు. జగదీశన్ టైలర్ గా పనిచేస్తుండగా.. సరస్వతి ఇంటి వద్దే ఉంటూ తన నలుగురు పిల్లలను చూసుకుంటోంది. ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య 'శృంగారం' విషయంలో గొడవ తలెత్తింది.

జగదీశ్ శృంగారం కోసం ఒత్తిడి తేగా భార్య సరస్వతి నిరాకరించింది. అప్పటికీ భర్త మళ్లీ మళ్లీ అడగడంతో.. తీవ్ర కోపోద్రిక్తురాలైన సరస్వతి.. కిచెన్ లోకి వెళ్లి కత్తితో బయటకొచ్చింది. ఆ వెంటనే భర్త మర్మాంగాన్ని కోసేయడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో జగదీశన్ కేకలు పెట్టాడు.
అతని కేకలు విన్న స్థానికులు హుటాహుటిన అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంతలో సరస్వతి ఇంటినుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరస్వతి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications