Wife: అర్దరాత్రి ఇంటికి వెళ్లిన భర్త, బెడ్ రూమ్ లో భార్య కిలకిలా, పకపకా అంటూ ? !
చెన్నై/ చెంగల్పట్టు: ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం తరువాత ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత భార్య ఉద్యోగం మానేసింది. భర్త ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. భార్య బంధువులకు ఫోన్ చేసిన భర్త తన భార్యకు ఐరన్ బాక్స్ షాక్ కొట్టి చనిపోయిందని చెప్పాడు. పిల్లల భవిష్యత్తు కారణంగా పోలీసులకు ఫిర్యాదు చెయ్యకూడదని భార్య బంధువులకు చెప్పిన భర్త హడావిడిగా అంత్యక్రియులు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది.

ఒకే కంపెనీలో ఉద్యోగం
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకంలోని కాలనిపాక్కం ఏరియాలో రంజిత్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రంజిత్ కుమార్ ఉద్యోగం చేస్తున్న కంపెనీలో సుధామతి (27) అనే యువతి ఉద్యోగంలో చేరింది. ఆ సందర్బంలో రంజిత్ కుమార్, సుధామతికి పరిచయం అయ్యింది.

లవ్ మ్యారేజ్
ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రంజిత్ కుమార్, సుధామతి ప్రేమించుకున్నారు. 5 సంవత్సరాల క్రితం రంజిత్ కుమార్, సుధామతి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. రంజిత్ కుమార్, దంపతులకు 3 ఏళ్లు, 18 నెలలు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత సుధామతి ఉద్యోగం మానేసింది.

అర్దరాత్రి ఇంటికి వెళ్లిన భర్తకు షాక్
హోటల్ లో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్న రంజిత్ కుమార్ అతని భార్య సుధామతి, ఇద్దరి పిల్లలను పోషిస్తున్నాడు. హోటల్ లో ఉద్యోగం చేస్తున్న రంజిత్ కుమార్ అర్దరాత్రి దాటిన తరువాత ఇంటికి వెలుతున్నాడు. అర్దరాత్రి 2.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లిన రంజిత్ కుమార్ అతని భార్య సుధామతి తీరుతో షాక్ అయ్యాడు.

అర్దరాత్రి ఫోన్ లో భార్య కిలకిల... పకపక అంటూ ?
అర్దరాత్రి దాటిన తరువాత తన భార్య సుధామతి ఫోన్ లో ఎవ్వరితోనే కిలకిల నవ్వుతూ మాట్లాడుతున్న విషయం గమనించిన రంజిత్ కుమార్ రగిలిపోయాడు. ఎవ్వరితో మాట్లాడుతున్నావు అని రంజిత్ కుమార్ ప్రశ్నిస్తే అతని భార్య సుధామతి ఎదురుతిరిగి మాట్లాడిందని సమాచారం. ఆ సమయంలో రంజిత్ కుమార్, సుధామతి మద్య పెద్ద గొడవ జరిగింది.

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?
చాలాకాలం నుంచి సుధామతి ఫోన్ లో ఎవరితోనో ఎక్కువగా మాట్లాడుతుందని రంజిత్ కుమార్ కు అనుమానం ఉంది. తన భార్య సుధామతి అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని రంజిత్ కుమార్ కు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే సందర్బంలో సుధామతి ఎదురుతిరగడంతో సహనం కోల్పోయిన రంజిత్ కుమార్ ఇంట్లో ఉన్న పెద్ద కర్రతో సుధామతి తల మీద దాడి చేసి చంపేశాడు.

కర్రతో భార్యను చంపేసి ఐరన్ బాక్స్ స్టోరీ
పోలీసు కేసు అవుతుందని భయపడిన రంజిత్ కుమార్ ఐరన్ బాక్స్ ఆన్ చేసి బట్టలు ఇస్త్రీ చేసి ఆ వైర్ సధామతి చేతికి చుట్టేసి తన భార్య కరెంట్ షాక్ తో చనిపోయిందని అందరిని నమ్మించడానికి ప్రయత్నించాడు. సుధామతి తల్లి కేసు పెట్టడంతో పోలీసుల విచారణలో స్టోరీ మొత్తం బయటకు వచ్చేసింది.












Click it and Unblock the Notifications