Wife: బేకరీలో భార్య, ఇంట్లో భర్త, టైమ్ టూ టైమ్ ?, ఏదో జరుగుతోంది, అదే విషయంలో రచ్చ, చంపేసిన భర్త !
చెన్నై: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి కూతురు, కొడుక్కి జన్మనిచ్చింది. భర్త, పిల్లలతో కలిసి భార్య చాలా సంతోషంగా ఉండేది. సొంతంగా బేకరి నిర్వహిస్తున్న భర్త డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు భర్త, మద్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భార్య బేకరీలో వ్యాపారం చేస్తున్నారు. సాయంత్రం మళ్లీ బేకరి దగ్గరకు వెలుతున్న భర్త రాత్రి వరకు వ్యాపారం చేసి ఇంటికి వెలుతున్నాడు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా భర్త ఇంట్లోనే మకాం వెయ్యడంతో అతని భార్యకు అనుమానం వచ్చింది.
మద్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భర్త ఇంట్లో ఏం చేస్తున్నాడు ?, ఎవరైనా వచ్చి వెలుతున్నారా ? అని భార్యకు అనుమానం మొదలైయ్యింది. బేకరీని మద్య మూసివేసి ఇంటికి వెళ్లి చెక్ చేసుకోవడానికి భార్యకు అవకాశం లేకుండా పోయింది. బేకరీ క్లోజ్ చెయ్యాలంటే మగవారి సహాయం కావడంతో భార్య ఆమె భర్త ఇంట్లో ఏమి చేస్తున్నాడో కనిపెట్లలేకపోయింది. ఇదే విషయంలో దంపతులు గొడవ పడుతున్నారు. ఇదే విషయంలో పెద్ద గొడవ జరగడంతో భర్త పాపపు పనులు ప్రశ్నించిన భార్య దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

హ్యాపీలైఫ్
చెన్నైలోని అంబత్తూరు సూరపట్టు ప్రాంతంలోని జేపీ నగర్, రెండవ వీధిలో ముత్తు (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ముత్తును వివాహం చేసుకున్న విజయలక్ష్మి (35) అనే మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. ముత్తు, విజయలక్ష్మి దంపతులకు దీపశ్రీ (13) అనే కూతురు, వసంత్ (10) అనే కొడుకు ఉన్నారు. భర్త ముత్తుతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి విజయలక్ష్మి చాలా సంతోషంగా ఉండేది. సొంతంగా బేకరి నిర్వహిస్తున్న భర్త ముత్తు డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

బేకరీలో భార్య..... టైమ్ టూ టైమ్ ఇంట్లో ఉంటున్న భర్త
ప్రతిరోజు ఉదయం నుంచి మద్యాహ్నం వరకు భర్త ముత్తు, మద్యాహ్నం నుంచి సాంయంత్రం వరకు అతని భార్య విజయలక్ష్మి బేకరీలో వ్యాపారం చేస్తున్నారు. సాయంత్రం మళ్లీ బేకరి దగ్గరకు వెలుతున్న భర్త ముత్తు రాత్రి వరకు వ్యాపారం చేసి ఇంటికి వెలుతున్నాడు. ప్రతిరోజు మద్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ముత్తు ఇంటికే పరిమితం అవుతున్నాడు.

భార్యకు అనుమానం
ప్రతిరోజూ క్రమం తప్పకుండా భర్త ముత్తు ఇంట్లోనే మకాం వెయ్యడంతో అతని భార్య విజయక్ష్మికి అనుమానం వచ్చింది. మద్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భర్త ముత్తు ఇంట్లో ఏం చేస్తున్నాడు ?, అతని కోసం ఎవరైనా మహిళలు వచ్చి వెలుతున్నారా ? అని భార్య విజయక్ష్మికి అనుమానం మొదలైయ్యింది. భర్త ముత్తు వ్యవహారం గురించి భార్య విజయలక్ష్మి ఆరా తియ్యడం మొదలు పెట్టింది.

భార్యకు చాన్స్ చిక్కలేదు
బేకరీని మద్య మూసివేసి ఇంటికి వెళ్లి తన భర్త ముత్తు ఏం చేస్తున్నాడో చెక్ చేసుకోవడానికి అతని భార్య విజయక్ష్మికి అవకాశం లేకుండా పోయింది. బేకరీ క్లోజ్ చెయ్యాలంటే మగవారి సహాయం అవసరం కావడంతో విజయలక్ష్మి ఆమె భర్త ముత్తు ఇంట్లో ఏమి చేస్తున్నాడో కనిపెట్లలేకపోయింది. భర్త ముత్తు ఇంట్లో ఏం చేస్తున్నాడో ? అనే విషయంపై చుట్టుపక్కల వారిని ఆరా తియ్యడం మొదలు పెట్టింది.

భార్యను దుమ్ములేపిన భర్త
భార్య లేని సమయంలో ఇంట్లో భర్త ముత్తు ఏం చేస్తున్నాడో ? అనే విషయంలో దంపతులు గొడవ పడుతున్నారు. ఇదే విషయంలో పెద్ద గొడవలు జరుగుతున్నాయి. భర్త ముత్తు పాపపు పనులు ప్రశ్నించిన భార్య విజయలక్ష్మి మీద ఆమె భర్త ముత్తు దాడి చేశాడు. తీవ్రగాయాలైన భార్య విజయలక్ష్మి కుప్పకూలిపోయింది.

ప్రశ్నించినందుకు ప్రాణం పోయింది
తీవ్రగాయాలైన విజయలక్ష్మిని ఆమె బంధువులు చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన విజయలక్ష్మి రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం అర్దరాత్రి మరణించిందని పోలీసులు అన్నారు. ఇంట్లో జల్సాలు చేస్తున్న భర్త ముత్తును ప్రశ్నించినందుకు విజయలక్ష్మి హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ముత్తును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని అంబత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రామస్వామి మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications