వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెడ్ రూంలో నగ్నంగా భార్య, ప్రియుడు, భర్త ఎంట్రీ, రూ. 45 లక్షలు ఇన్సూరెన్స్, అడ్డంగా !

|
Google Oneindia TeluguNews

చెన్నై: భర్త వ్యాపారం చెయ్యడానికి వెళ్లిన సమయంలో ప్రియుడితో కలిసి నగ్నంగా జల్సా చేస్తున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. భర్త భార్య, ఆమె ప్రియుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. తమకు అడ్డంగా ఉన్న భర్తను హత్య చేసి అతని పేరుతో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి ఉండాలని భార్య మాస్టర్ ప్లాన్ వేసిన ఘటన తమిళనాడులో జరిగింది. అంతే మద్యం మత్తులో ఉన్న భర్తను అడ్డంగా హత్య చేయించింది.

దంపతులు, పిల్లలు

దంపతులు, పిల్లలు

తమిళనాడులోని ధర్మపురి జిల్లా కారిమంగళంలోని నేతాజీ రోడ్డులో మాదేశన్, రేవతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి యోగేష్, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఇప్పుడిప్పుడే వయసుకు వస్తున్నారు.

గార్మెంట్స్ వ్యాపారం

గార్మెంట్స్ వ్యాపారం

మాదేశన్ నైంకనికోటేలో గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతి రోజు కారిమంగళం నుంచి నైంకనికోటేకి వచ్చి వెలుతున్నాడు. భార్య రేవిత, ఇద్దరు కుమారులకు డబ్బుపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని మాదేశన్ కష్టపడుతున్నాడు.

రేవతి ప్రియుడు

రేవతి ప్రియుడు

గత జనవరి నెలలో మాదేశన్ ఎప్పటిలాగే ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. రేవతికి జయప్రకాష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. భర్త, పిల్లలు బయటకు వెళ్లడంతో రేవతి ప్రియుడు జయప్రకాష్ కు ఫోన్ చేసి పిలుపించుకునింది.

నగ్నంగా చిక్కన భార్య

నగ్నంగా చిక్కన భార్య

ఇంటి నుంచి బయటకు వెళ్లిన మాదేశన్ డబ్బు మరిచిపోయానని గమనించి మార్గం మధ్యలోనే వెనక్కి వచ్చాడు. ఇంటికి వచ్చి చూడగా బెడ్ మీద రేవతి, జయప్రకాష్ నగ్నంగా దర్శనం ఇచ్చారు. అంతే మాదేశన్ కు మండిపోయింది. జయప్రకాష్, రేవతిని చితకబాది ఇంకోసారి చూస్తే చంపేస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు.

ఫిబ్రవరి 27

ఫిబ్రవరి 27

ఫిబ్రవరి 27వ తేదీ ఇంటి నుంచి గార్మాంట్స్ వ్యాపారం చెయ్యడానికి మాదేశన్ కారిమంగళం నుంచి వెళ్లాడు. అదే రోజు రాత్రి ధర్మపురి-క్రిష్ణగిరి రహదారిలో మాదేశన్ శవమై కనిపించాడు. కారిమంగళం పోలీసులు రోడ్డు ప్రమాదంలో మాదేశన్ మరణించాడని కేసు నమోదు చేశారు.

మౌనంగా భార్య రేవతి

మౌనంగా భార్య రేవతి

ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి మాదేశన్ మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టుం జరుతున్న గది దగ్గరకు మాదేశన్ భార్య వెళ్లింది. అక్కడ రేవతి మౌనంగా ఒక్క కన్నీటి చుక్కా కార్చకుండా కుర్చున్న విషయం పోలీసులు గుర్తించారు.

రేవతి మీద నిఘా

రేవతి మీద నిఘా

మాదేశన్ కు విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉందని, మద్యం మత్తులో కిందపడి మరణించి ఉంటాడని రేవతి పోలీసులను నమ్మించింది. అయితే పోలీసులు నిఘా వెయ్యడంతో జయప్రకాష్ రేవతి కుమారులు లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి గంటలు గంటలు ఉండి వెలుతున్న విషయం గుర్తించారు.

డెత్ నోట్ కోసం కొడుకు

డెత్ నోట్ కోసం కొడుకు

రేవతి ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తిరుగుతూ ఒక్క వారంలో డెత్ సర్టిఫికెట్ కావాలని వైద్యుల మీద ఒత్తిడి తీసుకువచ్చింది. యోగేశన్ మరణించి ఒక్క వారం కూడా పూర్తి కాకుండానే డెత్ సర్టిఫికెట్ అంత అవసరం ఏముందని పోలీసులు ఆరా తీశారు.

రూ. 55 లక్షలు ఇన్సూరెన్స్

రూ. 55 లక్షలు ఇన్సూరెన్స్

మాదేశన్ ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ. 10 లక్షలకు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ. 45 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించి నామినీగా భార్య రేవతి పేరు పెట్టాడు. డెత్ సర్టిఫికెట్ తీసుకున్న రేవతి ఇన్సూరెన్స్ కు క్లైం చేసిందని పోలీసులు వివరాలు సేకరించారు. జయప్రకాష్ ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రియుడి కోసం

ప్రియుడి కోసం

భర్త మాదేశన్ ను హత్య చేస్తే ఇన్సూరెన్స్ డబ్బు అంతా తనకే వస్తుందని, మనం సుఖంగా ఉండాలంటే నా భర్తను చంపేయాలని రేవతి ఆమె ప్రియుడు జయప్రకాష్ కు చెప్పింది. భర్త మాదేశన్ రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరి వస్తాడు అనే సమచారం ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీ జయప్రకాష్ తన స్నేహితులతో కలిసి కారిమంగళం సమీపంలో మాదేశన్ ను అడ్డగించి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

జైల్లో ప్రియుడు, ప్రియరాలు

జైల్లో ప్రియుడు, ప్రియరాలు

శుక్రవారం కారిమంగళం పోలీసులు భర్త మాదేశన్ ను హత్య చేయించిన భార్య రేవతి, ఆమె ప్రియుడు జయప్రకాష్, అతని స్నేహితులు వెంకటేష్, విగ్నేష్ లను అరెస్టు చేశారు. మాదేశన్ హత్య కేసులో అతని కుమారులకు ఎలాంటి సంబంధం లేదని కారిమంగళం పోలీసులు తెలిపారు.

English summary
Wife killed husband with her illegal lover to gt the benefit of Insurance on his husband's name near Dharmapuri in Tamil Nadu. Police arrested Revathi who confessed about the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X