couple: లవ్ మ్యారేజ్, కొత్త ఇంట్లో కాపురం, సొంత ఇంటిలో ఏం జరిగిందంటే ?, ఒకేసారి ఇలాంటి ?
దంపతుల మధ్య అసలు సమస్యలు మొదలైనాయి. చివరికి మొదటికే మోసం రావడంతో లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు ఇద్దరూ ఒకేసారి ఒకేచోట శవాలైనారు.
చెన్నై/ కోయంబత్తూరు: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. తరువాత కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న దంపతులు హ్యాపీగా ఉన్నారు. భర్త వ్యాపారాలు చేస్తున్నాడు. కొత్త ఇల్లు కట్టుకున్న దంపతులు చాలా హ్యాపీగా ఉన్నారు. తరువాత దంపతుల మధ్య అసలు సమస్యలు మొదలైనాయి. చివరికి మొదటికే మోసం రావడంతో లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు శవాలైనారు.

సొంతంగా వ్యాపారం
తమిళనాడులోని కోయంబత్తూరులోని తొండముత్తూరు కులతుప్పాలయంలో అయ్యసామి (35) అనే వ్యక్తి సొంతంగా జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. జిరాక్స్ దుకాణం నడుపుతున్న అయ్యస్వామి దానితో పాటు వ్యాపారం చెయ్యాలని అనుకున్నాడు. సెకండ్ హ్యాండ్ బైక్ లు, కార్లు కొనుగొలు చెయ్యడం, వాటిని విక్రయించడం చేస్తున్నాడు. అయ్యస్వామి సెకండ్ హ్యాండ్ వాహనాల డీలర్‌గా పనిచేస్తున్నాడు.

లవ్ మ్యారేజ్
కొన్ని సంవత్సరాల క్రితం అయ్యాస్వామికి వనిల్లా (30) అనే యువతి పరిచయం అయ్యింది. ఏడు సంవత్సరాల పాటు అయ్యస్వామి, వనిల్లా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు అయ్యస్వామి, వనిల్లా పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న వనిల్లా, అయ్యస్వామి దంపతులు హ్యాపీగా ఉన్నారు. అయ్యస్వామి అతని వ్యాపారాలు అతను చేసుకుంటున్నాడు.

సొంత ఇల్లు కట్టుకున్న దంపతులు
కొన్ని నెలల క్రితం అయ్యస్వామి, వనిల్లా సొంత ఇల్లు నిర్మించుకుని అదే ఇంటిలో నివాసముంటున్నారు. గత మూడు రోజులుగా అయ్యస్వామి ఇల్లు తెరవకపోవడం, షాపులో కూడా కనపడకపోవడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి, బంధువులకు అనుమానం వచ్చింది. అయ్యస్వామి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు తొండముత్తూరు పోలీసులకు సమాచారం అందించారు.

అసలు ఏం జరిగింది ?
పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లోని బెడ్ రూమ్ లో అయ్యస్వామి, వనిల్లా ఇద్దరి మృతదేహాలు సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాయి. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తొండముత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎవ్వరూ ఊహించలేదు ?
అందులో అయ్యస్వామికి రూ.2. 50 కోట్ల అప్పు ఉందని, ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇల్లు కూడా కట్టేందుకు అప్పు చేసి ఇబ్బందుల్లో పడ్డాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రామిక విచారణలో వెలుగు చూసిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారని అందరూ అనుకున్నారు. అయితే చివరికి ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications