Wife love story: భార్యకు ప్రియుడు, రివేంజ్ కాదు, భర్త రివర్స్ గేర్, ఏం చేశాడంటే, స్పాట్ లో భర్త !
ఇండోర్/చెన్నై: తన భార్యకు ప్రియుడున్నాడని తెలుసుకున్న భర్త చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యింది. స్పాట్ లో నిలబడిన భర్త అతని భార్య లవ్ స్టోరీకి శుభం కార్డు వేశాడు. కుటుంబ సభ్యులు చూపించన యువకుడిని వివాహం చేసుకున్న మహిళ భర్త ఇంటికి చేరుకుని అతనితో కాపురం చేసింది. భర్తతో కళ్లు మూసుకుని కాపురం చేసిన భార్య ఐదు సంవత్సరాల క్రితం ఓ పాపకు తల్లి అయ్యింది. 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న భార్య రానురాను ఆమె తీరులో చాలా మార్పులు వచ్చాయి. కూతురు పుట్టిన తరువాత ఇంకా ఎక్కువ మార్పులు రావడంతో భర్తకు అనుమానం పెరిగిపోయింది.
ఇష్టం ఉండి లేనట్లు కాపురం చెయ్యడం, ఎక్కువగా పుట్టింటికి వెళ్లి అక్కడ చాలా రోజులు ఉండటంతో భర్తకు అనుమానం ఎక్కువ అయ్యింది. కొంతకాలం తరువాత తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడని, అతన్ని కలవడానికి తన భార్య ఎక్కువగా బయటకు వెలుతోందని భర్తకు తెలిసింది. అందరు భర్తల లాగా అతను ఆలోచించలేదు. తన భార్యకు ప్రియుడు ఉన్నాడని తెలిసినా ఆ భర్త సైలెంట్ ఉండిపోయాడు. భార్య మీద కాని, ఆమె ప్రియుడి మీద కాని ప్రతీకారం తీర్చుకోవాలని స్కెచ్ వెయ్యలేదు. ఓ రోజు భార్యను బయటకు పిలుచుకుని వెళ్లిన భర్త నీ మనసులో ఏ ముంది ?, నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు కావాలా అని భార్యను నెమ్మదిగా అడిగి తెలుసుకున్నాడు. తన ప్రియుడి గురించి భర్త సైలెంట్ గా పిన్ టూ పిన్ చెప్పడంతో భార్య ఆశ్చర్యపోయింది. అక్కడ దంపతులు ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. తరువాత దంపతులు ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత భర్త ఆమె ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడటంతో అసలు కథ మొదలైయ్యింది.

ఆ రోజు పెళ్లికి ఓకే చెప్పిన యువతి
ఇండోర్ లోని విజయ్ నగర్ లో మురళి శర్మా (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు షాలిని (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని చూసి పెళ్లి చేసుకోవాలని మురళి శర్మాకు చెప్పారు. మురళి శర్మాను వివాహం చేసుకోవాలని షాలినికి ఆమె కుటుంబ సభ్యులు అన్నారు. మురళి శర్మాను వివాహం చేసుకోవడానికి షాలిని అప్పట్లో ఓకే చెప్పడంతో 8 ఏళ్ల క్రితం ఇద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

దంపతులకు 5 ఏళ్ల కుమార్తె
కుటుంబ సభ్యులు చూపించన మురళి శర్మాను వివాహం చేసుకున్న షాలిని భర్త ఇంటికి చేరుకుని అతనితో కాపురం చేసింది. భర్త మురళి శర్మాతో కళ్లు మూసుకుని కాపురం చేసిన షాలిని ఐదు సంవత్సరాల క్రితం ఓ పాపకు తల్లి అయ్యింది. 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న భార్య షాలిని తీరులో రానురాను చాలా మార్పులు వచ్చాయి.

భార్య మీద భర్తకు అనుమానం
కూతురు పుట్టిన తరువాత షాలినిలో ఇంకా ఎక్కువ మార్పులు రావడంతో భర్త మురళి శర్మాకు అనుమానం పెరిగిపోయింది. షాలిని ఇష్టం ఉండి లేనట్లు కాపురం చెయ్యడం, ఎక్కువగా పుట్టింటికి వెళ్లి అక్కడ చాలా రోజులు ఉండటంతో భర్త మురళి శర్మాకు అనుమానం ఎక్కువ అయ్యింది. భార్య షాలిని ప్రవర్తనను ఆమె భర్త షాలిని శర్మా క్షుణ్ణంగా పరిశీలించాడు.

నా భార్యకు ప్రియుడు ఉన్నాడా ?
కొంతకాలం తరువాత తన భార్య షాలినికి రాకేష్ అనే ప్రియుడు ఉన్నాడని, అతన్ని కలవడానికి తన భార్య ఎక్కువగా బయటకు వెలుతోందని భర్త మురళి శర్మాకు తెలిసింది. అందరు భర్తల లాగా మురళి శర్మా ఎక్కువగా ఆలోచించలేదు. తన భార్య షాలినికి రాకేష్ అనే ప్రియుడు ఉన్నాడని తెలిసినా మురళి శర్మా చాలా సైలెంట్ ఉండిపోయాడు. భార్య షాలిని మీద కాని, ఆమె ప్రియుడు రాకేష్ మీద కాని ప్రతీకారం తీర్చుకోవాలని మురళి శర్మా క్రిమినల్ స్కెచ్ వెయ్యలేదు.

నీకు నేనంటే ఇష్టమా ?, నీ ప్రియుడు అంటే ఇష్టమా
ఓ రోజు భార్య షాలినిని బయటకు పిలుచుకుని వెళ్లిన మురళి శర్మా నీ మనసులో ఏ ముంది ?, నువ్వు ప్రేమించిన రాకేష్ నీకు కావాలా, లేక నేను కావాలా చెప్పాలని మురళి శర్మా అతని భార్యను నెమ్మదిగా అడిగి తెలుసుకున్నాడు. తన ప్రియుడు రాకేష్ గురించి తన భర్త మురళి శర్మా సైలెంట్ గా పిన్ టూ పిన్ చెప్పడంతో షాలిని ఆశ్చర్యపోయింది.

భార్య ప్రియుడితో మాట్లాడిన భర్త
చాలా సేపు మనసు విప్పి మాట్లాడుకున్న మురళి శర్మా, షాలిని దంపతులు ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. తరువాత మురళి శర్మా, షాలిని దంపతులు ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. తన భార్య షాలినికి విడాకులు ఇవ్వాలని అనుకున్నానని మురళి శర్మా కోర్టులో చెప్పాడు. తన భార్య షాలినికి ఎందుకు విడాకులు ఇస్తున్నాను అనే విషయం మురళి శర్మా కోర్టులో చెప్పాడు.

నా భార్య ఆమె ప్రియుడి దగ్గరే సంతోషంగా ఉంటుంది
తన భార్య షాలినికి ఆమె ప్రియుడు రాకేష్ అంటే చాలా ఎక్కువ ఇష్టమని, తన దగ్గర కంటే అతని దగ్గరే ఆమె సంతోషంగా ఉంటుందని, అందుకే విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నామని మురళి శర్మా కోర్టులో చెప్పారు. కొంతకాలం కోర్టులో విడాకుల కేసు విచారణ జరిగింది. మురళి శర్మా, షాలిని దంపతులు ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకోవడానికి అంగీకరించడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.

పవర్ ఫుల్ మొగుడు
భార్య షాలినితో విడాకులు తీసుకున్న మురళి శర్మా షాలిని ప్రియుడు రాకేష్ తో మాట్లాడాడు. తన మాజీ భార్య షాలినికి ఏ మాత్రం కష్టం రాకుండా చూసుకోవాలని అతని దగ్గర మాట తీసుకున్నాడు. తరువాత మురళి శర్మా అతని మాజీ భార్య షాలిని, రాకేష్ వివాహం దగ్గర ఉండి జరిపించాడు. ఐదు సంవత్సరాల వయసు ఉన్న కూతురితో కలిసి మొదటి భర్త మురళి శర్మా సమక్షంలో ప్రియుడు రాకేష్ ను వివాహం చేసుకున్న షాలిని అతని ఇంటికి వెళ్లింది.

మొగుడి దెబ్బతో ఫ్యామిలీ మైండ్ బ్లాక్
మొదటి భర్త అతని భార్యకు విడాకులు ఇవ్వడమే కాకుండా దగ్గర ఉండి భార్యకు రెండో పెళ్లి చెయ్యడం ఇండోర్ లో హాట్ టాపిక్ అయ్యింది. భర్త చేసిన పనికి అతని ఫ్యామిలీతో పాటు అతని భార్య ఫ్యామిలీ మైండ్ బ్లాక్ అయ్యింది. 23 సంవత్సరాల క్రితం 1998లో ఇవివి సత్యనారాయణ శ్రీకాంత్, ఉపేంద్ర హీరోలుగా తెలుగులో తెరకెక్కించిన కన్యాదానం సినిమా ఇప్పుడు మరోసారి మనకు గుర్తుకు వచ్చినట్లు అయ్యింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ కు కూతురు లేదు, ఇక్కడ హీరోయిన్ కు ఐదు సంవత్సరాల కూతురు ఉంది, అంతే తేడా.












Click it and Unblock the Notifications