Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: రూ. కోట్లలో ఆస్తులు, భర్త మీద భార్యకు అనుమానం, హౌస్ అరెస్టు, టార్చర్ తట్టుకోలేక భర్త, పాపం!

లూధియానా: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త తరువాత విదేశాలకు వెళ్లాడు. విదేశాల్లో బాగా సంపాదించిన భర్త సొంఊర్లో, పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడు. ఎంత సంపాధించినా ఏమి లాభం అన్నట్లు దంపతులకు పిల్లలు లేరు. భర్త సంపాధించిన ఆస్తులు అన్నీ ఆయన బంధువులకు వెళ్లిపోతాయని భార్యకు అనుమానం పెరిగింది. చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉన్న దంపతులు తరువాత భారత్ వచ్చారు. భారత్ చేరుకున్న తరువాత భార్య ఆమె భర్త పేరుతో ఉన్న ఆస్తులు మొత్తం ఆమె బంధువులకు రాసివాల్వాలని ఒత్తిడి చేసింది.

మనతదానంతరం మన ఆస్తులు బంధువులకు రాసిద్దామని, ఇప్పుడు ఆస్తులు మొత్తం వేరే వ్యక్తులు రాసిచ్చేస్తే మనల్ని చులకనగా చూస్తారని, అసలు పట్టించుకోరని భర్త ఆయన భార్యకు నచ్చచెబుతూ వచ్చాడు. అయితే భార్య మాత్రం భర్త పేరుతో ఉన్న ఆస్తులు ఆమె పేరుతో, ఆమె బంధువుల పేరుతో రాసివాల్వాలని భర్తకు టార్చర్ పెట్టి అతన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా టార్చర్ పెట్టింది. ఇంట్లో నుంచి తప్పించుకున్న భర్త అతని కారులో నేరుగా నది సమీపంలోకి వెళ్లి చేతి మణికట్టు కోసుకుని నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

మొదట్లో హ్యీపీలైఫ్

మొదట్లో హ్యీపీలైఫ్

పంజాబ్ లోని లూధియానా సమీపంలోని రాయికోట్ సమీపంలోని ఆండ్లు గ్రామంలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 30 సంవత్సరాల క్రితం రాజేష్ శీతల్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. శీతల్ ను వివాహం చేసుకున్న తరువాత రాజేష్ చాలా సంతోషంగా జీవించాడు.

విదేశాల్లో ఉద్యోగం

విదేశాల్లో ఉద్యోగం

భార్య శీతల్ తో సంతోషంగా కాపురం చేస్తున్న ఆమె భర్త రాజేష్ కొన్ని సంవత్సరాల తరువాత విదేశాలకు వెళ్లాడు. అమెరికాలో డబ్బు బాగా సంపాదించిన రాజేష్ సొంత ఊర్లో, లూధియానా, ఆ పరిసర పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడు. ఎంత సంపాధించినా ఏమి లాభం అన్నట్లు రాజేష్, శీతల్ దంపతులకు పిల్లలు పుట్టలేదు.

భార్యకు అనుమానం

భార్యకు అనుమానం

భర్త రాజేష్ సంపాధించిన ఆస్తులు అన్నీ ఆయన బంధువులకు వెళ్లిపోతాయని, రాజేష్ సోదరి ఆమె పిల్లల పేరుతో ఆస్తులు రాపించుకుంటుందని శీతల్ కు అనుమానం పెరిగిపోయింది. చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉన్న రాజేష్, శీతల్ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం భారత్ వచ్చిన దంపతులు లూధియానా సమీపంలోని సొంత ఊర్లో ఉంటున్నారు.

 ఆస్తులు రాసివాల్వని చెప్పిన భార్య

ఆస్తులు రాసివాల్వని చెప్పిన భార్య

భారత్ చేరుకున్న తరువాత శీతల్ ఆమె భర్త రాజేష్ పేరుతో ఉన్న ఆస్తులు మొత్తం ఆమె బంధువులకు రాసివాల్వాలని ఒత్తిడి చేసింది. అయితే రాజేష్ మాత్రం అతని భార్య శీతల్ మాటలను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. మనతదానంతరం మన ఆస్తులు మీ బంధువులు, మా బంధువులకు రాసిద్దామని, ఇప్పుడు ఆస్తులు మొత్తం వేరే వ్యక్తులు రాసిచ్చేస్తే మనల్ని చులకనగా చూస్తారని, మనల్ని అసలు పట్టించుకోరని రాజేష్ అతని భార్య శీతల్ కు కొంతకాలం నచ్చచెబుతూ వచ్చాడు.

భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భర్త రాజేష్ ఎంత చెప్పినా శీతల్ మాత్రం ఆయన మాట వినలేదు. భర్త రాజేష్ పేరుతో ఉన్న ఆస్తులు ఆమె పేరుతో, ఆమె బంధువుల పేరుతో రాసివాల్వాలని శీతల్ ఆమె భర్తకు టార్చర్ పెట్టింది. భర్తను బయటకు పంపిస్తే ఆయన పేరుతో ఉన్న ఆస్తులు అతని చెల్లెలి పిల్లలకు రాసిస్తాడనే అనుమానంతో భర్తను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా శీతల్ టార్చర్ పెట్టింది. ఇంట్లో నుంచి తప్పించుకున్న రాజేష్ నేరుగా అతని కారులో లూధియానా సమీపంలోని జర్వాన్ కెనాల్ సమీపంలోకి వెళ్లి అతని వెళ్లి అతని చేతి మణికట్టు కోసుకుని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్త ఆత్మహత్య కేసులో భార్య అరెస్టు

భర్త ఆత్మహత్య కేసులో భార్య అరెస్టు

రాజేష్ సోదరి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. మరుసటి రోజు రాజేష్ శవాన్ని బయటకు తీశారు. తన సోదరుడు రాజేష్ ను తన వదిన శీతల్ టార్చర్ పెట్టడం వలనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని రాజేష్ సోదరి పోలీసు కేసు పెట్టింది. భర్త రాజేష్ ను అతని భార్య శీతల్ అత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+