Wife: భార్య శరీరం మీద ఫ్రెండ్ బలవంతంగా రంగులు పోశాడని భర్తకు కోపం, తుపాకితో కాల్చిచంపేసి!

కోల్ కత్తా: దేశవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. చాలా మంది స్థానికులు జరుపుకున్న హోలీ పండుగలో బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు, స్థానికులు, స్నేహితులు, బంధువులు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. ఓ ప్రాంతంలో స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు కలిసి రోడ్డు మీదకు వచ్చి రంగులు చల్లుకుని హోలీ జరుపుకున్నారు. ఆ సమయంలో స్నేహితుడి భార్య ముఖానికి రంగులు చల్లిన వ్యక్తి ఆమె మీద రంగునీళ్లు పోశాడు. అదే సమయంలో సమీపంలో ఉన్న భర్త తన భార్య మీద స్నేహితుడు రంగులు చల్లాడని గమనించాడు.

ఆ సమయంలో నువ్వు నా భార్య మీద ఎందుకు రంగులు చల్లావు అంటూ గొడవకు దిగాడు. అక్కడ స్నేహితుల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన వ్యక్తి అతని భార్య ముఖం మీద రంగులు పూసిన వ్యక్తిని తుపాకితో కాల్చి చంపేయడం కలకలం రేపింది. హోలీ వేడుకల్లో స్నేహితుడిని హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన భర్తను వెంటాడని పోలీసులు చివరికి అతన్ని పట్టుకున్నారు.

దేశవ్యాప్తంగా హోలీ

దేశవ్యాప్తంగా హోలీ

దేశవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. చాలా మంది స్థానికులు జరుపుకున్న హోలీ పండుగలో బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు, స్థానికులు, స్నేహితులు, బంధువులు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు వారి స్నేహితులు, సహచరులతో కలిసి ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు.

ఒకే ప్రాంతంలో స్నేహితులు నివాసం

ఒకే ప్రాంతంలో స్నేహితులు నివాసం

ఉత్తరప్రదేశ్ కు చెందిన దిలీప్ చౌహాన్ (45) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం కోల్ కత్తా చేరుకుని నాటూన్ పల్లిలోని బంధువులు నివాసం ఉంటున్న ఏరియాలోనే అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. దిలీప్ నివాసం ఉంటున్న ఏరియాలోనే సుజిత్ మల్లిక్ కూడా నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి సుజిత్ మల్లిక్, దిలీప్ స్నేహితులు.

రోడ్డు మీద హోలీ జరుపుకున్నారు

రోడ్డు మీద హోలీ జరుపుకున్నారు

నాటున్ పల్లిలో నివాసం ఉంటున్న స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు కలిసి రోడ్డు మీదకు వచ్చి రంగులు చల్లుకుని హోలీ జరుపుకున్నారు. ఆ సమయంలో దిలీప్ అతని స్నేహితుడు సుజిత్ మల్లిక్ భార్య ముఖానికి రంగులు చల్లి ఆమె మీద రంగునీళ్లు పోశాడు. ఆ సమయంలో సుజిత్ మల్లిక్ భార్యతో పాటు స్థానికుల మీద దిలీప్ రంగులు చల్లాడు.

నా భార్య మీద ఎందుకు రంగులు పోశావు?

నా భార్య మీద ఎందుకు రంగులు పోశావు?

అదే సమయంలో సమీపంలో ఉన్న సుజిత్ మల్లిక్ తన భార్య మీద స్నేహితుడు దిలీప్ బలవంతంగా రంగులు చల్లుతున్నాడని గమనించాడు. ఆ సమయంలో నువ్వు నా భార్య మీద ఎందుకు రంగులు చల్లావు అంటూ సుజిత్ మల్లిక్ అతని ఫ్రెండ్ దిలీప్ తో గొడవకు దిగాడు. ఆ సందర్బంలో దిలీప్, సుజిత్ మల్లిక్ మద్య మాటామాటా పెరిగిపోయింది.

తుపాకితో కాల్చి చంపేసిన ఫ్రెండ్

తుపాకితో కాల్చి చంపేసిన ఫ్రెండ్

రోడ్డు మీదనే స్నేహితులు సుజిత్ మల్లిక్, దిలీప్ ల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన సుజిత్ మల్లిక్ అతని భార్య ముఖం మీద రంగులు పూసిన దిలీప్ ను తుపాకితో కాల్చి చంపేయడం కలకలం రేపింది. హోలీ వేడుకల్లో స్నేహితుడు దిలీప్ ను హత్య చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన డైమండ్ హార్బర్ ప్రాంతంలో తలదాచుకున్న సుజిత్ మల్లిక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కోల్ కత్తా పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+