Wife: ఇంట్లో దూరి డ్రగ్స్ వ్యాపారిని కాల్చి చంపేశారు, పండుగ రోజు భార్య మీద నలుగురు, ఊరు వదిలేసినా !

న్యూఢిల్లీ/ ఘాజియాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి భార్య మీద నలుగురు కామాంధుల కన్నుపడింది. సమయంలో చూసి ఆమెను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. హోలీ పండుగ సందర్బంగా దంపతులు, ఆ నలుగురు వ్యక్తులు కలిశారు. ఆ సమయంలో భార్య మీద ఆమె ఇంట్లోనే ఆమెను నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది. గ్యాంగ్ రేప్ కేసులో తప్పించుకుని తిరిగిన నిందితులు కేసు వాపస్ తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బాధితురాలిని, ఆమె భర్తను బెదిరించారు. ప్రాణభయంతో మూడు నెలల క్రితం దంపతులు ఊరు వదిలేసి నిందితులకు కనపడకుండా సిటీకి మకాం మార్చారు. రాత్రి దంపతుల ఇంటికి చోరబడిన నిందితులు బాధితురాలి భర్తను దారుణంగా రివాల్వర్ తో కాల్చి చంపేశారు. తన మీద గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులు తన భర్తను చంపేశారని వారి పేర్లు మొత్తం చెప్పిన ఆమె పోలీసు కేసు పెట్టింది.

 భర్త డ్రగ్స్ డీలర్

భర్త డ్రగ్స్ డీలర్

ఘాజియాబాద్ లో రాజేష్ శర్మా (35), స్వప్నా శర్మా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేష్ శర్మా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్నాడని అతని భార్యకు తెలుసు. డ్రగ్స్ విక్రయిస్తున్న రాజేష్ కు కొందరు నేరస్తులు పరిచయం అయ్యారని తెలిసింది.

 కామాంధుల కన్నుపడింది

కామాంధుల కన్నుపడింది

రాజేష్ డ్రగ్స్ వ్యాపారం చెయ్యడంతో చాలా మందితో అతనికి పరిచయం ఉంది. మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి అనే నలుగురు రాజేష్ కు పరిచయం అయ్యారు. డ్రగ్స్ విక్రయిస్తున్న రాజేష్ భార్య మీద మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి అనే నలుగురు కామాంధుల కన్నుపడింది. సమయంలో చూసి ఆమెను లొంగదీసుకోవాలని మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి అనేక ప్రయత్నాలు చేశారు.

 హోలి రోజు భార్య మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

హోలి రోజు భార్య మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

హోలీ పండుగ సందర్బంగా రాజేష్ శర్మా, స్వప్నా శర్మా దంపతులు, మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి వ్యక్తులు కలిశారు. ఆ సమయంలో స్వప్నా శర్మా మీద ఆమె ఇంట్లోనే ఆమెను మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి మీద గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది.

 ఊరు వదిలిపారిపోయిన దంపతులు

ఊరు వదిలిపారిపోయిన దంపతులు

గ్యాంగ్ రేప్ కేసులో తప్పించుకుని తిరిగిన నిందితులు మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి కేసు వాపస్ తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బాధితురాలిని, ఆమె భర్త రాజేష్ శర్మాను బెదిరించారు. ప్రాణభయంతో మూడు నెలల క్రితం రాజేష్ శర్మా, స్వప్నా శర్మా దంపతులు ఊరు వదిలేసి నిందితులకు కనపడకుండా ఈశాన్య ఢిల్లీలో అద్దె ఇంటిని తీసుకుని అక్కడికి మకాం మార్చి అక్కడే నివాసం ఉంటున్నారు.

 భర్తను రివాల్వర్ తో కాల్చి చంపేశారు

భర్తను రివాల్వర్ తో కాల్చి చంపేశారు

రాత్రి ఢిల్లీలోని రాజేష్ శర్మా, స్వప్నా శర్మా దంపతుల ఇంటికి చోరబడిన నిందితులు బాధితురాలి భర్తను దారుణంగా రివాల్వర్ తో కాల్చి చంపేశారు. తన మీద గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులు తన భర్తను చంపేశారని వారి పేర్లు మొత్తం చెప్పిన ఆమె పోలీసు కేసు పెట్టింది. మేరజ్, గుడ్డు, తమ్జీత్, వాషి మీద హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు.

 భార్యకు ఫుల్ సెక్యూరిటీ

భార్యకు ఫుల్ సెక్యూరిటీ

తన భర్త మాదకద్రవ్యాలు విక్రయించేవాడని అతని భార్య అంగీకరించిందని, తప్పించుకున్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని ఢిల్లీ ఈశాన్య విభాగం డీసీపీ సంజయ్ షైన్ స్థానిక మీడియాకు చెప్పారు. భర్త హత్యకు గురికావడంతో పోలీసులు అతని భార్యను నిందితుల కంటపడకుండా రహస్య ప్రాంతంలో పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+