Wife Sketch: బెడ్ రూమ్ లో దూరం పెట్టింది, రెండో పెళ్లికి స్కెచ్, భర్తను సింపుల్ గా చంపేసింది, ఫినిష్ !

చెన్నై/ తూత్తుకూడి/ కోవిల్ పట్టి: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఇప్పుడు చేదు అయ్యింది. పరాయి స్త్రీ మోజులో పడిపోయిన భర్త ఇంతకాలం బెడ్ రూమ్ లో తన అవసరాలు తీర్చిందని, ఇక చాలు, కొంచెం కొత్త టేస్ట్ చూడాలని రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. మీరు చేస్తున్న పని తప్పు అని కొంతకాలం భార్య ఆమె భర్తకు సర్దిచెప్పింది. పోయే ఢ్యాష్ అంటూ బూతులు తిట్టిన భర్త రెండో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. భర్త చెప్పిన మాటవినడం లేదని గుర్తించిన భార్య భద్రకాళి లాగా రెచ్చిపోయింది. రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను భార్య సింపుల్ గా చంపేసి అతనికి యముడి దగ్గరకు గేట్ పాస్ ఇచ్చేసింది.

 ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కోవిల్ పట్టిలోని లాయర్ కాలనీలో ప్రభు (38), ఉమామహేశ్వరి (36) దంపతుల నివాసం ఉంటున్నారు. 7 సంవత్సరాల క్రితం ప్రభు, ఉమామహేశ్వరిల పెళ్లి జరిగింది. ప్రభు, ఉమా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగిన తరువాత కొన్ని సంవత్సరాలు ప్రభు భార్య ఉమాతో పాటు ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా గడిపాడు.

 బెడ్ రూమ్ లో భర్తను దూరం పెట్టిన భార్య

బెడ్ రూమ్ లో భర్తను దూరం పెట్టిన భార్య

కొంతకాలంగా తనకు శారీరఖ సుఖం ఇవ్వడం లేదని ప్రభు అతని భార్య ఉమాతో గొడవపడుతున్నాడు. ఉమా అనారోగ్య కారణంగా భర్తను బెడ్ రూమ్ లో దూరం పెట్టిందని తెలిసింది. ఇదే విషయంలో దంపతుల మద్య అప్పుడప్పుడు గొడవలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభు, ఉమా దంపతులకు సర్దిచెబుతూ వచ్చారు.

 టెస్ట్ మార్చాలని డిసైడ్ అయిన భర్త

టెస్ట్ మార్చాలని డిసైడ్ అయిన భర్త

భార్య ఉమాతో తాను సుఖపడలేనని ఆలోచించిన ప్రభు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. నేను రెండో పెళ్లి చేసుకుంటానని, నువ్వు నాకు సహకరించాలని భార్య ఉమాకు ప్రభు విషయం చెప్పాడు. మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు, మీరు చేస్తున్న పని తప్పు అని భార్య ఉమా భర్త ప్రభుకు నచ్చచెబుతూ వస్తోంది.

 దెబ్బకు భర్త ప్రాణాలు పైకి పార్శిల్

దెబ్బకు భర్త ప్రాణాలు పైకి పార్శిల్

ప్రైవేట్ మిల్ లో మంచి ఉద్యోగం చేస్తున్న ప్రభు రెండో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటే తనకు, తన పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచించిన ఉమా భర్తను చంపేయాలని డిసైడ్ అయ్యింది. మద్యం సేవించి ఇంట్లో ఘాడంగా నిద్రపోతున్న భర్త ప్రభు గొంతు నులిమి చంపేసింది.

Recommended Video

    AP Panchayat Elections Candidates Eligibility పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి?.. అర్హులు, అనర్హులు ఎవరు?.
     సార్..... ఇదీ స్టోరీ........అంతే !

    సార్..... ఇదీ స్టోరీ........అంతే !

    విషయం తెలుసుకున్న కోవిల్ పట్టి ఈస్ట్ పోలీసులు ప్రభు మృతదేహాన్ని పోస్టుమార్టుంకు తరలించారు. పోస్టుమార్టుం నివేదికలో ప్రభు హత్యకు గురైనాడని వెలుగు చూసింది. పోలీసులు ఉమాను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఆమె జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. భర్త ప్రభు రెండో పెళ్లి చేసుకుని తమకు అన్యాయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని కోపంతో ఉమా అతన్ని హత్య చేసిందని, ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించామని కోవిల్ పట్టి ఈస్ట్ పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+