మోడీ చాయ్ కొన్న వారికి దిగ్విజయ్ బంపర్ ఆఫర్!
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిన్నప్పుడు తాను చాయ్ అమ్మానని ప్రధాని నరేంద్ర మోడీ అనేకమార్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దిగ్విజయ్ సింగ్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
నరేంద్ర మోడీ వద్ద గతంలో ఎవరైనా చాయ్ కొని ఉన్నట్లుగా నిరూపించగలిగితే తాను రెండు లక్షల నజరానా ఇస్తానని దిగ్విజయ్ సింగ్ ప్రకటిచారు. అలాగే ఆయనతో కలిసి డిగ్రీ చదివినట్లుగా ఎవరైనా రుజువు చేయగలిగితే వారికి కూడా 2లక్షలు ఇస్తానని చెప్పారు.

మహారాష్ట్రంలోని అర్నిలో రైతులతో బహిరంగ సభ నిర్వహించిన సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'చాయ్ కీ చర్చా' పేరిట రైతుల నిరసన ర్యాలీలో దిగ్విజయ పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయారని మోడీపై ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే దాభాడి ప్రాంతంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తప్పుడు వాగ్ధానాలతో రైతులను మోసం చేశారని దిగ్విజయ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications