India Name Change : ఇండియా పేరు భారత్ గా మారబోతోందా ? పార్లమెంట్ ప్రత్యేక భేటీలోనే !

భారత దేశానికి ఉన్న ఇంగ్లీష్ పేరు ఇండియా భారత్ గా మారబోతోందా ? ఈ దిశగా కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందా ? ఈ నెల 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు సాగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఈ మేరకు ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్రం బిల్లు తీసుకురాబోతోందా ? అధికార బీజేపీ ఎంపీలతో పాటు ఢిల్లీ వర్గాల్లో సాగుతున్న చర్చల సారాంశం వాస్తవమైతే మాత్రం ఇండియా ఇకపై భారత్ గా పేరు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.

will indias name to be changed as bharat in parliament special session ?

ఇప్పటికే ప్రతీ అంశంలోనూ స్వదేశీ మంత్రం జపిస్తున్న కేంద్రం.. దేశానికి కూడా ఇంగ్లీష్ పేరు అయిన ఇండియాకు బదులుగా భారత్ అనే పేరు పెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటీష్ కాలం నాటి ఎన్నో నల్ల చట్టాలతో పాటు కీలకమైన ఐపీసీ, సీఆర్పీపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ను కూడా పేర్లు మార్చి భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్రం.. పనిలో పనిగా ఇండియా పేరు కూడా మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఇండియా పేరు మార్పు ప్రయత్నాల వెనుక మరో కీలక కారణం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న కూటమికి ఇండియా పేరు పెట్టారు. ఇప్పుడు బ్రిటీష్ కాలం నాటి పేరన్న కారణంతో ఇండియాను వదిలిపెట్టి భారత్ గా పేరు మార్చేస్తే అప్పుడు విపక్షాల్ని విదేశీ పేరుతో టార్గెట్ చేయొచ్చన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విపక్షాలకు చెక్ పెట్టేందుకు కూడా కేంద్రం ఇండియా పేరు భారత్ గా మార్చనుందన్న చర్చ జరుగుతోంది.

ఇండియా పేరు మార్చాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఇండియా పేరు పెడుతూ చేసిన చట్టాల్ని సవరించి భారత్ పేరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ బిల్లుకు లోక్ సభలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. రాజ్యసభలోనూ ఈ మధ్య ఎన్డీయే నెగ్గించుకున్న బిల్లుల్ని చూస్తే ఇక్కడా పేరు మార్పు బిల్లు ఆమోదం నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. దీంతో ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇతర కీలక బిల్లులతో పాటు ఇండియా పేరు మార్పు బిల్లు పెట్టొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+