PM Modi vs Priyanka Gandhi : మోడీపై ప్రియాంక గాంధీ పోటీ ఖాయమైందా ?
వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. ఇప్పటికే యూపీ కాంగ్రెస్ ఛీఫ్ గా తాజాగా బాధ్యతలు చేపట్టిన అజయ్ రాయ్.. రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. దీంతో రాహుల్ పోటీ చేసే స్దానంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రియాంక గాంధీ తొలిసారి బరిలోకి దిగే సీటు ఏదనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని శివసేన థాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. ఇండియా కూటమి ముందంజలో ఉందని, కూటమిలో ఎవరికి సీటు సరిపోతుందో చర్చిస్తుందని ఆమె వెల్లడించారు. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తే ఆమె విజయం సాధిస్తుందని ప్రియాంక చతుర్వేది జోస్యం చెప్పారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రజలకు తెలుసని, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి తదుపరి ప్రధాని ఎన్నిక కానున్నందున ఎర్రకోటపై నుంచి మోదీ చేసే చివరి ప్రసంగం ఇదేనని ప్రియాంక చతుర్వేది అన్నారు.దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల బాధలు, మహిళలపై దౌర్జన్యాలు అన్నీ పెరిగాయని ఆమె ఆరోపించారు. అలాగే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారన్నారు. బీజేపీని ఈ అన్ని అంశాలపై నిలదీస్తారని కూడా తెలిపారు.
ఇది ఎర్రకోట నుండి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చివరి ప్రసంగం అన్నారు. మరో ఏడాదిలోగా ఇండియా కూటమి ప్రధాని వచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రియాంక చతుర్వేది ధీమా వ్యక్తం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బీజేపీలో చేరడంపై వచ్చిన ఊహాగానాలపైనా ప్రియాంక స్పందించారు. శరద్ పవార్ ఈ విషయంపై చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఇండియా కూటమి పొత్తులో ఉన్నందున.. తాము బీజేపీతో ఎప్పటికీ చేతులు కలపబోనన్నారని తెలిపారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications