సోనియాలాగా పార్టీని నడుపుతామన్న లాలూ భార్య రబ్రీ

తన కుమారులు తేజ్, తేజస్విలతో కలిసి ఆర్జేడిని నడిపిస్తామని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు. లాలూ ఆబ్సెన్స్‌లో తాము బీహార్‌లో పార్టీని నడిపిస్తున్నామన్నారు.
కాంగ్రెసు పార్టీని సోనియా, రాహుల్‌లు నడిపిస్తున్నట్లే తాము ఆర్జేడిని బీహార్‌లో పటిష్టపరుస్తామని చెప్పారు. లాలూతో నిన్న కోర్టుకు వచ్చిన తేజస్వి తండ్రికి శిక్ష పడటాన్ని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ప్రజాకోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.
రబ్రీ దేవి తమ నాయకురాలు అని, ఆమె తమను నడిపిస్తుందని ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రాంకృపాల్ యాదవ్ చెప్పారు. కాగా, రబ్రీ దేవి 1999లో ఏడాదికి పైగా బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత 2000 నుండి 2005 వరకు చేశారు.












Click it and Unblock the Notifications