సుప్రీంకోర్టుకు సెలవు-రేపటి నుంచి జనవరి 1 వరకు- కేంద్రం విమర్శలు !

దేశంలో అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా శీతాకాల సెలవులు తీసుకోబోతోంది. రేపటి నుంచి జనవరి 1 వరకూ శీతాకాల సెలవులు ఇస్తున్నట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. దీంతో రేపటి నుంచి జనవరి 1 వరకూ సుప్రీంకోర్టులో ఏ బెంచ్ కూడా పనిచేయదని తెలిపారు.

అయితే సుప్రీంకోర్టు 16 రోజుల పాటు శీతాకాల సెలవులు ప్రకటించడం పట్ల కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలం సెలవులు తీసుకోవడం వల్ల సుప్రీంకోర్టుకు వచ్చే పిటిషనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న తెలిపారు. కిరణ్ రిజిజు ప్రకటన వచ్చిన 24 గంటల్లోనే సుప్రీంకోర్టు శీతాకాల సెలవులపై మౌఖిక ఆదేశాలు ప్రకటించింది. దీంతో రేపటి నుంచి ఈ ఆదేశాల ప్రకారం సెలవులు అమల్లోకి రానున్నాయి. దీనిపై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

winter holidays to supreme court from tomorrow till january 1 amid centres criticism

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్ని కొలీజియం వ్యవస్ద చేపడుతుండటంపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. దీనిపై ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో జాతీయ న్యాయ నియామకాల బిల్లును తీసుకొచ్చినా దాన్ని కొట్టేయడమే కాకుండా కొలీజియం వ్యవస్ధను అమలు చేస్తుండటంపై కేంద్రం మండిపడుతోంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ కూడా ఈ మధ్యే తెలిపారు. దీనిపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా సుప్రీంకోర్టు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శీతాకల సెలవుల అంశంపైనా కేంద్రం విమర్శలకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+