భారత్‌లో కరోనా: 3లక్షల మంది బలి -కొత్తగా 2.2లక్షల కేసులు -తగ్గుతోన్న వైరస్ ఉధృతి
దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. కొత్త కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతున్నా, మరణాల సంఖ్య మాత్రం పైపైకి వెళుతూ ఆందోళనల్ని రెట్టింపు చేస్తున్నది. నిన్న ఒక్కరోజే నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాలు మూడులక్షల మార్కును దాటాయి. గ్లోబల్ గా కరోనా మరణాల్లో భారత్ 3వ స్థానంలో ఉండగా, అమెరికా, బ్రెజిల్ తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి..
Recommended Video
కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెలువరించిన బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 19,28,127 శాంపిళ్లను పరీక్ష చేయగా, కొత్తగా 2,22,315 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. అయితే మరణాలు మాత్రం నిన్న ఒక్కరోజే 4,454గా నమోదయ్యాయి. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,03,720కు, మొత్తం కేసుల సంఖ్య 2,67,52,447కు పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో 3,02,544 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 2,37,28,011కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 88.30శాతం, మరణాలు రేటు 1.13శాతం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక..
వ్యాక్సిన్ల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,60,51,962 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ఇక, నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 19,28,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 33,05,36,064 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
-
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!!












Click it and Unblock the Notifications