పొరపాటున భర్తను చంపేసింది, ఎలా జరిగిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: బెంగుళూరులో స్థిరపడిన ఓ మళయాళీ కుటుంబం కేరళలోని మున్నార్ కు విహారయాత్రకు వెళ్ళింది. ఈ విహారయాత్ర ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు భార్య చేతిలో భర్త మరణించాడు. సైకిల్ రైడింగ్ చేస్తున్న భర్తను భార్య ఢీకొట్టింది.దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.

ఆశోక్ సుకుమారన్ నాయర్, రేష్మి దంపతులు తమ పిల్లలు శ్రద్ద, శ్రేయలతో కలిసి మున్నార్ కు వెళ్ళారు. ఆశోక్ సరదాగా సైకిల్ పై రైడింగ్ కు వెళ్ళాడు. ఆయన వెనుకే రేష్మి పిల్లలతో కలిసి కారులో ఫాలో అవుతోంది.

accident

కారులో స్టీరియో సిస్టమ్ సౌండ్ ను పెద్దగా పెట్టారు పిల్లలు. అయితే సౌండ్ ను తగ్గించేందుకు రేష్మి ప్రయత్నించింది ఈ క్రమంలోనే ఆమె డ్రైవింగ్ పై నియంత్రణను కోల్పోయింది. ముందు వెళ్తున్న భర్త సైకిల్ ను ఆమె ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆశోక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రేష్మి వెంటనే తన భర్తను కారులో సమీపంలోని ఆసుపత్రికి తరలించింది.అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

ఆశోక్ తలకు గాయం కావడంతో ముక్కునుండి ఎక్కువగా రక్తస్రావమై చనిపోయాడని వైద్యులు ప్రకటించారు.ఈ ఘటన ఆ కుటుంబాన్ని విషాదంలో నెట్టింది. ఈ ప్రమాదం నుండి రేష్మి ఇంకా కోలుకోలేదని పోలీసులు చెప్పారు. ఆశోక్, రేష్మిలది కేరళ. ఉద్యోగ రీత్యా బెంగుళూరులో వారిద్దరూ స్థిరపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Bengaluru-based Malayalee family's vacation to Munnar turned tragic when the husband, who was riding a bicycle, died after being knocked down by a car that was driven by his wife.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి