కట్ చేసింది: ప్రియుడితో పట్టుబడిన భార్య ... భర్తనుఏమి చేసిందో తెలుసా..?
వేలూరు: భార్య భర్తల గొడవలో భర్త అంగాన్ని భార్య కొరికేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వేలూరు జిల్లా తురైమూలై గ్రామంలో సెంతామరై, జయంతి దంపతులు నివాసముంటున్నారు. సెంతామరై ఆ గ్రామంలో రైతు. గ్రామంలోని ఆలయ ఉత్సవాల్లో భాగంగా దంపతులిద్దరూ అక్కడ జరిగే వేడుకలను వీక్షించేందుకు వెళ్లారు. ఉత్సవాలు వీక్షించిన తర్వాత స్థానిక క్రీడల్లో పాల్గొన్నారు. అప్పటికే తెల్లవారుజాము 1.30 గంటలు అయ్యింది. కొంచెం సేదతీరుతానని చెప్పిన జయంతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ భర్త సెంతామరై వెళ్లాడు.
అలా భార్య కోసం వెతుక్కుంటూ వెళ్లిన సెంతామరైకు జయంతి తన ప్రియుడు దక్షిణామూర్తితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించింది. ఇది చూసి షాక్‌కు గురయ్యాడు సెంతామరై. అదే సమయంలో కోపోద్రిక్తుడయ్యాడు. వారిద్దరి అక్రమ సంబంధం గురించి బయటపెడుతానని సెంతామరై బెదిరించాడు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చాడు. తమను కాపాడాల్సిందిగా దక్షిణ మూర్తి కేకలు వేసినప్పటికీ... ఊరంతా ఉత్సవాల సందడిలో మునిపోయి ఉండటం, డప్పుల శబ్దానికి ఆయన కేకలు వినపడలేదు.

ఇద్దరిని లాక్కొచ్చే క్రమంలో సెంతామరై దోతీ ఊడిపడింది. అప్పటికే భయంతో ఉన్న జయంతి గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకోకముందే తప్పించుకోవాలని భావించింది. భర్త సెంతామరైతో పెనుగులాటకు దిగింది. ఈ క్రమంలోనే సెంతామరై పురుషాంగాన్ని కొరికి... తన ప్రియుడు దక్షిణామూర్తితో పారిపోయింది. రక్తస్రావంతో సెంతామరై అక్కడే పడిపోయాడు. కాసేపటికి సెంతామరైను గమనించిన గ్రామస్తులు వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి చెన్నైలోని రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీకి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
దక్షిణా మూర్తి సెల్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేసి దాని ఆధారంగా జయంతిని పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చేసిన నేరం జయంతి కోర్టులో ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. వేలూరు మహిళా సెంట్రల్ జైలుకు జయంతిని తరలించారు పోలీసుల.












Click it and Unblock the Notifications