Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంగమ్మ ఒడ్డున దారుణం: అన్నా నన్ను వదిలేయ్ అని వేడుకున్నా కనికరించని కామాంధులు

పాట్నా: ఆడవాళ్లు అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతత్రం వచ్చినట్లు అని నాటి స్వాతంత్ర్య సమరయోధులు చెప్పారు. కానీ మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి చాలా ఏళ్లు గడిచినా ఆడవారిపై మాత్రం అరాచకాలు ఆగడం లేదు. ఇంటినుంచి బయటకు వస్తే నక్కలా మాటు వేసి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటారు కామాంధులు. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టిన మహిళ తిరిగి ఇంటికి చేరుకుంటుందా లేదా అనే టెన్షన్ నేటి సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తోంది. ఇందుకు కారణం మృగాళ్లలా మహిళలపై దాడి చేసేందుకు కాచుకూర్చున్న మగాళ్లు. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. గంగానదిలో స్నానానికి వెళ్లిన మహిళను ఒడ్డుకు ఈడ్చుకువచ్చి అత్యంత పైశాచికంగా ఆమెపై లైంగిక దాడి చేశారు కొందరు మృగాళ్లు.

పవిత్రమైన గంగానది తీరంలో...

పవిత్రమైన గంగానది తీరంలో...

బీహార్‌లోని బర్ అనే ప్రాంతంలో ఓ 45 ఏళ్ల మహిళ స్నానం చేసేందుకు గంగానది తీరంలో ఉన్న సిమార్ ఘాట్‌కు వెళ్లింది. పవిత్ర స్నానం ఆచరిస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆమెపై కన్నేశారు. స్నానం చేస్తున్న మహిళను ఒడ్డుకు లాక్కొచ్చారు. అందులో ఒకడు మహిళపై అత్యాచారానికి పాల్పడగా... మరో నిందితుడు ఆ చర్యను వీడియోలో రికార్డ్ చేశాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని శివపుజన్ మహతో, విశాల్ కుమార్‌లుగా గుర్తించారు

 పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు: స్థానికులు

పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు: స్థానికులు

అత్యాచారం గురించి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే నిందితులనుంచి ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడింది. కానీ స్థానికులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందని అయితే పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని చెప్పారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగానే పోలీసులు చర్యలు చేపట్టారని చెప్పారు.

అన్నా ఉపవాసంలో ఉన్నా... నన్ను వదిలేయండి

అన్నా ఉపవాసంలో ఉన్నా... నన్ను వదిలేయండి

మహిళ గంగానదిలో స్నానం చేస్తుండగా మహతో అనే మొదటి నిందితుడు చిన్నగా మహిళ దగ్గరకు వెళుతున్నట్లు వీడియోలో ఉంది. ఆపై ఆమెను బయటకు లాక్కొచ్చి అత్యాచారం చేశాడు. తనను వదిలివేయాల్సిందిగా మహిళ బతిమాలుకొంటున్నట్లుగా వీడియోలో ఉంది. అంతేకాదు తాను తన పిల్లలకోసం ఉపవాసంలో ఉన్నానని... దయచేసి తన వ్రతాన్ని చెడగొట్టొద్దని మహిళ వేడుకొంది. పవిత్రమైన గంగమ్మ తల్లి నదీ అని ఇక్కడ ఇలాంటి ఘటనలకు పాల్పడితే శాపానికి గురవుతామని మహిళ వేడుకుంది. అయినా పాపాత్ములు కనికరించలేదు. ఆమె నోరు చేతులతో కప్పేసి అరవకుండా చేసి ఆమెపై అత్యాచారం చేశాడు.

అన్నా నన్ను వదిలేయి..

అన్నా నన్ను వదిలేయి..

నేను ఉపవాసంలో ఉన్నాను... నన్ను వదిలేయ్ అన్నా అని మహిళ పదేపదే కేకలు వేసింది. కానీ ఇవేమీ పట్టించుకోని దుర్మార్గుడు పశువులా ఆమెపైకి కామంతో దూకాడు. ఇదిలా ఉంటే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అత్యాచారానికి గురైన మహిళకు ఇద్దరు ఆడపిల్లలు. ఆమె భర్త ఢిల్లీలో పనిచేస్తారు. త్వరగా ఛార్జ్ షీట్ దాఖలయ్యేలా చూస్తామని, కేసు విచారణ కూడా త్వరతగతిన పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు పాట్నా ఎస్ఎస్పీ మను మహారాజ్. దీనిపై ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్ నితీష్ ప్రభుత్వం, ఎన్డీఏ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+