మత్తు మందు కలిపి మహిళపై 5గురు అత్యాచారం, నిందితుల్లో ఎస్సై కొడుకు

మజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. మజఫర్ నగర్‌లోని 26ఏళ్ల మహిళపై శనివారం ఐదురుగు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన నిందితుల్లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ కొడుకు కూడా ఉన్నాడని ఆదివారం పోలీసులు వెల్లడించారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్నేహితురాలి కోసం గిఫ్ట్ కొనేందుకు దుకాణానికి వెళ్లిన మహిళపై మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, షాపు యజమానితో సహా ఐదుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Woman drugged, gang-raped by five including cop's son in Muzaffarnagar

ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించినట్లుగా కొత్వాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. నిందితులను విజయ్ కుమార్, అనుజ్ సేథీ, పియాష్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ కుమారుడు కపిల్‌గా గుర్తించామని వెల్లడించారు.

ప్రస్తుతానికి ఐదవ నిందితుడు ఎవరన్నది వెల్లడించ లేదు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి, మిగతా వారి కోసం గాలింపు చేపట్టామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+