దారుణం: హోటల్‌కు వచ్చిన మహిళకు మత్తుమందిచ్చి.. సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలిసిన వ్యక్తి పిలవడంతో హోటల్ గదికి వెళ్లిన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లోని హోటల్ గదిలో 32 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాజస్థాన్‌లోని అల్వార్‌లో నివాసం ఉంటున్న ముగ్గురు నిందితులు అజయ్(39), తారా చంద్(34) నరేష్(38)లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఆదివారం ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఈ ఘటన గురించి పిసిఆర్ కాల్ వచ్చిందని వాయువ్య పోలీసు డిప్యూటీ కమిషనర్ ఉషా రంగనాని తెలిపారు.తనకు పరిచయమైన అజయ్ ఆదివారం హోటల్ గదికి తనను ఆహ్వానించాడని, అక్కడ అతని ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారని ఆ బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
మహిళకు మత్తమందు కలిపిన పానీయం ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. క్రైమ్ బృందం హోటల్ నుంచి నమూనాలను తీసుకున్న తర్వాత మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications