ఏఎస్ఐ ఫ్యామిలీకి అసభ్య సందేశాలు: మహిళ అరెస్ట్

Woman held for sending lewd SMSs to cop, wife
ఔరంగాబాద్: ఓ పోలీసు కుటుంబానికి అసభ్య సందేశాలు పంపిన వితంతు మహిళను సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి ఎంఐడిసి వాలుజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తోపాటు అతని భార్య, కుమారుడికి అసభ్య, అశ్లీల సందేశాలు పంపడంతో ఆమెపై ఐటి చట్టం కింద కేసు నమోదు చేశారు.

సైబర్ క్రైం బ్రాంచ్ చీఫ్, పోలీస్ ఇన్ స్పెక్టర్ గౌతమ్ పటారే కథనం ప్రకారం.. అసభ్య సందేశాలు పంపిన నిందితురాలి కూతురు కొన్నేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ కేసును విచారించేందుకు సదరు సబ్ ఇన్‌స్పెక్టర్ విచారణాధికారిగా నియమితులయ్యాడు. విచారణ నిమిత్తం సదరు అధికారి తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో వారికి పరిచయం ఏర్పడింది.

కేసు విచారణ పూర్తయినప్పటికీ ఆమె ఇంటికి ఆ అధికారి వెళ్లేవాడు. ఆమెకు ఓ సెల్‌ఫోన్ కూడా ఇచ్చాడు. రెండేళ్ల నుంచి వారు తరచూ కలుసుకునేవారు. కాగా, గత కొంతకాలంగా అతడు ఆమెకు దూరంగా ఉండటంతో ఆమె అతనిపై కోపం పెంచుకుంది. దీంతో అతనికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకుంది.

ఈ నేపథ్యంలోని ఆమె పోలీసు అధికారికి అశ్లీల, అసభ్య సందేశాలను పంపడం మొదలుపెట్టింది. ఆ సందేశాలను అతనితోపాటు అతని భార్య, కుమారుడికి కూడా పంపించింది. ఇతర మహిళలతో సంబంధాలున్నట్లు ఉండే సందేశాలను కూడా ఆమె పంపింది. ఏఎస్ఐ ఇచ్చిన ఫోన్ ద్వారానే వివిధ సిమ్ కార్డులతో ఈ సందేశాలను పంపడం గమనార్హం. కాగా, సదరు బాధిత పోలీస్ అధికారి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+