చూడ్డానికి చదువుకున్నదానిలా ఉన్నావ్.. ట్రైన్ లో ఆ పని చేయడం సిగ్గుగా అనిపించలేదా?
టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. టీటీఈతో గొడవ పడింది. తనను "డిస్టర్బ్" చేస్తున్నాడని ఆరోపించింది. ఆయనతో ఆర్గ్యుమెంట్ కు దిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తోన్నందున ఏసీ కోచ్ నుండి బయటకు వెళ్లమని టీటీఈ గట్టిగా అడగడంతో ఈ గొడవ మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె వైఖరి పట్ల నెటిజన్లు స్పందిస్తోన్నారు. డివైడెడ్ టాక్ వస్తోంది.
బీహార్ లో చోటు చేసుకున్న ఘటన ఇది. ఆ మహిళ టికెట్ కొనకుండా రైలెక్కింది. ఏకంగా ఏసీ కోచ్ లో కూర్చుంది. టీటీఈ టికెట్ ను చెక్ చేయడానికి వచ్చినప్పుడు తొలుత తటపటాయించింది. టికెట్ చూపించమని గట్టిగా అడగడంతో గొడవకు దిగిందావిడ. టికెట్ లేనందున జనరల్ బోగీలోకి వెళ్లాలని టీటీఈ చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని నానా యాగీ చేసింది. రిజర్వ్ చేయబడిన సీటు ఖాళీ చేయమని గట్టిగా చెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది.

"మీ దగ్గర టికెట్ లేదు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇది రిజర్వ్డ్ సీటు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళండి. కావాలంటే జనరల్ బోగీలో కూర్చోండి. అది చేయకుండా జీఆర్పీతో ఉన్నాననో లేక ఇంకేదో కారణం ఎందుకు చెబుతారు. దయచేసి ఏసీ కోచ్ ను ఖాళీ చేయండి. టికెట్ లేకుండా మీరు ఇక్కడ కూర్చోకూడదు" అని స్పష్టం చేశారు.
దీనికి ఆమె ససేమిరా చెప్పింది. ఓ దశలో టీటీఈ చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. "నేను టీచర్ ని. నేనేమీ ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? మీరు నన్ను కావాలనే వేలెత్తి చూపుతున్నారు. మీరు కావాలని, ఒంటరిగా ఉన్న ఓ మహిళను డిస్టర్బ్ చేస్తున్నారు" అని బదులిచ్చింది.
"నేను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను. టీచర్ నని చెప్పుకుంటున్నారు. ట్రైన్ లో టికెట్ లేకుండా ప్రయాణించకూడదనే విషయం మీకు తెలియదా? అని టీటీఈ ప్రశ్నించారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఫోన్ చూపించమని అడిగింది. అంతే కాకుండా తనను రికార్డ్ చేస్తున్నాడని ఆరోపించింది. "మీరు ఇలా ఓ మహిళను రికార్డ్ చేయకూడదు.." అని ఎదురుతిరిగింది. "మీరు నన్ను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలుసు. నన్నేమీ చేయలేవు? అని గదమాయించడం ఈ వీడియోలో చూడొచ్చు.












Click it and Unblock the Notifications