నేను బిడ్డను కనాలి: రేపిస్ట్ భర్తకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు మెట్లెక్కిన మహిళ, ఏం జరిగింది?

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ మహిళ నుంచి వింత అభ్యర్థన వచ్చింది. బిడ్డను కనాలనుకుంటున్నాను.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆమె భర్త ఓ అత్యచారం కేసులో శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం. రేపిస్టు భర్తతో బిడ్డను కనాలని ఉందంటూ చేసిన అభ్యర్థన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె అభ్యర్థన సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుగుతోంది.

మైనార్ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో భర్త నిందితుడు..

మైనార్ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో భర్త నిందితుడు..

ఇదుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి మరో ముగ్గురు స్నేహిలతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు.. సచిన్ తోపాటు మిగిలిన నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే అతడు జైలుకెళ్లి ఏడేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో తమకు పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని, తమకు కలిసివుండే అవకాశం లభించలేదని సచిన్ భార్య వాపోయింది. మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని తాను కోరుకుంటున్నానని, కనుక తన భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలని సచిన్ భార్య హైకోర్టుకు విన్నవించారు.

భర్తకు బెయిలిస్తే బిడ్డను కంటానంటూ నిందితుడి భార్య..

భర్తకు బెయిలిస్తే బిడ్డను కంటానంటూ నిందితుడి భార్య..

తనకు మాతృత్వపు మాధుర్యం అనుభించాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని పిటిషన్లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలంపాటు బెయిల్ ఇస్తే తాను గర్భం దల్చేందుకు అవకాశం ఉంటుందని కోర్టుకు విన్నవించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. కాగా, గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పిటిషన్ రాలేదని వారు అభిప్రాయపడ్డారు. విచారణ సందర్భంగా దర్మాసనం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. అంతేకాగా, ఈ విషయంలో సలహా ఇవ్వాలని, మీ అభిప్రాయం తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

ఇప్పుడు భార్య.. బిడ్డలు వచ్చి తమ హక్కు అంటే..

ఇప్పుడు భార్య.. బిడ్డలు వచ్చి తమ హక్కు అంటే..

అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా? ఈమె భార్యగా నా హకకు అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా 'బిడ్డలుగా మా హక్కు' అనే అవకాశం ఉంది కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన పని, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా? అని హైకోర్టు ధర్మాసనం యోచిస్తోందన్నారు.

బెయిలిస్తే జరిగే పరిణామాలపై హైకోర్టు..

బెయిలిస్తే జరిగే పరిణామాలపై హైకోర్టు..

అంతేగాక, తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి కేసులు మనదేశంలో లేదా ఇతర దేశాల్లో వెలుగుచూశాయా? ఎలాంటి తీర్పులు ఇచ్చారనే విషయంపై హైకోర్టు పరిశోధనలు చేస్తోంది. గతంలో ఇలాంటి కేసులేమైనా ఉంటే ఏం జరిగిందనే విషయాలపై నివేదిక తయారుచేసి ఇవ్వాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ ఆసక్తిగా మారింది. తదుపరి విచారణలో కోర్టు తీర్పును వెలురించే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+