మారాం చేస్తున్నాడని కొడుకు నాలుక కోసేసింది!
కోల్‌కతా: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే తన కొడుకు నాలుకను కోసి అత్యంత దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయ్‌కాగ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు ఏదో విషయంలో మారాం చేస్తూ తల్లితో గొడవపడ్డారు. దాంతో విసిగిపోయిన తల్లి కోపంతో ఓ బాలుడి నాలుక కోసేసింది.
ఇది గమనించిన స్థానికులు రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications