దారుణం: ప్రియుడితో వెళ్లిందని వివాహిత బట్టలూడదీసి..
ఇండోర్: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్లిపోయిందనే కారణంగా ఓ వివాహత మహిళను బహిరంగంగా వివస్త్రను చేశారు మూర్ఖులైన పంచాయతీ పెద్దలు. ఈ ఘటన అలిరాజ్‌పూర్ జిల్లాలోని వాధా గ్రామంలో డిసెంబర్ 31న జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన తన బంధువు, ప్రియుడితో కలిసి కొన్ని రోజులక్రితం వెళ్లిపోయిన బాధిత మహిళ(25), తన ఇద్దరు పిల్లలతో తిరిగి తన గ్రామం వాధాకు వచ్చింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ధన్ సింగ్, కొందరు గ్రామ పెద్దలు ఆమెను, అతడ్ని పంచాయతీకి పిలిపించారు.

ఆ తర్వాత అందరూ చూస్తుండగా వారిద్దరినీ తీవ్రంగా కొట్టి.. గుండు కొట్టించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళను వివస్త్రను చేసి.. ఆమె స్థనాలను ప్రియుడితో కడిగించారు. కాగా, పంచాయతీ పెట్టించిన బాధితురాలి భర్త ఈ క్రూరత్వాన్ని, అసభ్యత్వాన్ని చూడలేక ఘటనను తీవ్రంగా వ్యతిరేకించాడు. పెద్దల ముందు తన నిరసన ను వ్యక్తం చేశాడు.
కాగా, గురువారం బాధితురాలు ఘటనపై ఉదయ్‌గఢ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో 10మంది నిందితులపై కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టామని అలిరాజ్‌పూర్ ఎస్పీ అఖిలేష్ ఝా శుక్రవారం తెలిపారు.












Click it and Unblock the Notifications