దారుణం: డ్రాప్ చేస్తానని యువతిపై అత్యాచారం చేశాడు

బెంగళూరు: అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి డ్రాప్ ఇస్తానని నమ్మించిన వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లా, దోడ్డబళ్లాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి మీద అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

 అనారోగ్యం

అనారోగ్యం

దోడ్డబళ్లాపురం సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న యువతి (25) అనారోగ్యంతో బాధపడుతోంది. దోడ్డబళ్లాపురం చేరుకున్న యువతి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. ఇంటికి వెళ్లడానికి బస్ స్టాప్ దగ్గరకు వెళ్లింది. ఎంత సేపటికి బస్సు రాకపోవడంతో యువతి అక్కడే వేచి ఉంది.

 సోదరి ఇల్లు

సోదరి ఇల్లు


ఎంత సేపు అయినా బస్సు రాకపోవడంతో దోడ్డబళ్లాపురం సమీపంలోని అరళుమల్లిగే గ్రామంలో నివాసం ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లాలని యువతి నిర్ణయించింది. తరువాత యువతి అరళుమల్లిగే బస్ స్టాప్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో కుంటహళ్ళిలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న చెన్నకేశవ (40) అనే వ్యక్తి అక్కడికి స్కూటర్ లో వెళ్లాడు.

స్కూటర్ లో డ్రాప్ ఇస్తా

స్కూటర్ లో డ్రాప్ ఇస్తా

తన అక్క నివాసం ఉంటున్న పక్క గ్రామంలోనే నివాసం ఉంటున్న చెన్నకేశవను డ్రాప్ ఇవ్వాలని యువతి కోరింది. యువతిని స్కూటర్ లో కుర్చోపెట్టుకున్న చెన్నకేశవ అరళుమల్లిగే గ్రామానికి బయలుదేరాడు. యువతికి అనుమానం వచ్చి స్కూటర్ నిలపాలని చెప్పింది.

కిందకు దూకేసిన యువతి

కిందకు దూకేసిన యువతి

చెన్నకేశవ మాత్రం స్కూటర్ ను మరింత వేగంగా నడిపాడు. భయంతో యువతి కిందకు దూకేసింది. తరువాత పోలంలో నుంచి అక్క నివాసం ఉంటున్న అరళుమల్లిగే గ్రామానికి యువతి బయలుదేరింది. ఆ సమయంలో యువతిని చెన్నకేశవ వెంబడించాడు.

వెంటాడి అత్యాచారం

వెంటాడి అత్యాచారం

యువతిని వెంటాడి పట్టుకుని ఆమె మీద అత్యాచారం చేసిన చెన్నకేశవ పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యువతి ఆమె అక్క ఇంటికి చేరుకుని జరిగిన విషయం చెప్పింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు చెన్నకేశవను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+