ఘోరం: 6 ఏళ్ల బాలికకు లేడీ టీచర్ లైంగిక వేధింపులు
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో చిన్నారుల పైన తరుచూ లైంగిక దాడుల అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో దారుణ సంఘటన బయటకు వచ్చింది. బెంగళూరు ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఓ ఉపాధ్యాయురాలు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
తనపై లైంగిక దాడి జరిగిందని బాలిక నిర్ధారించిందని పోలీసులు చెప్పారు. అయితే, ఆ మహిళా టీచర్‌ను చిన్నారి గుర్తించాల్సి ఉందని, గుర్తించాక ఆమెను అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం నాడు జరిగింది. నొప్పిగా ఉందని బాలిక ఏడుస్తుండడంతో ఘటన వెలుగులోకి వచ్చిందని ఓ పోలీసులు తెలిపారు.

కాగా, ఈ పాఠశాలను ఓ మహిళ నిర్వహిస్తోందని, ఆమె భర్త ఓ బేకరీ యజమాని అని తెలుస్తోంది. దీనిపై, నగర పోలీసు కమిషనర్ ఎమ్మెన్ రెడ్డి మాట్లాడుతూ... కేసును నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన చెప్పారు.
వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా తాము ముందుకు వెళ్తామని చెప్పారు. కాగా, శనివారం ఉదయం ఆ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శనివారం నాడు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
బెంగాల్‌లో ఎస్టేట్ యజమాని నరికివేత
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురిలో తేయాకు తోట యజమాని రాజేశ్ హత్యకు గురయ్యారు. ఆయన వద్ద పనిచేసే కార్మికులే ఈ దారుణానికి ఒడిగట్టారు. వేతన బకాయిల చెల్లింపులపై సోనాలి టీ ఎస్టేట్ కార్మికులు, యాజమాన్యం మధ్య వివాదం తలెత్తింది. దీని పరిష్కారం కోసం రాజేశ్‌ను చర్చలకు ఆహ్వానించిన కార్మికులు, తేయాకు తోటలోనే ఆయనను నరికి చంపారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications