• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మార్కండేయుల్లా ఉన్నారే - సీఎం స్టాలిన్ గ్లామర్ పై మహిళలు : రహస్యాన్ని చెప్పేసిన ముఖ్యమంత్రి..వీడియో వైరల్..!!

By Chaitanya
|

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రాష్ట్రంలో గతం కంటే భిన్నంగా పాలన సాగిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ ఆయన వ్యవహార శైలి గత తమిళనాడు పాలిటిక్స్ కు భిన్నంగా ఉండటంతో చర్చకు కారణమవుతోంది. ఇక, ముఖ్యమంత్రి తరచుగా సాధారణ ప్రజలతో మమేకం అవుతున్న తీరు సైతం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న నిర్ణయాల పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. గతంలో ప్రతిపక్షాల పైన ప్రతీకార రాజకీయాలకు పాల్పడే విధానం నుంచి వారిని కలుపుకుపోయే విధంగా స్టాలిన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అదే విధంగా ఖర్చుల తగ్గింపు విషయంలోనూ ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి ముఖ్యమంత్రి మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రం మొత్తం చర్చకు దారి తీసాయి. నిత్యం మందీ మార్బలం..ఆంక్షలతో సీఎం ను సామాన్యులు కలవాలంటేనే సాధ్యం కాని రీతిలో ఉండేది. అయితే, సీఎం స్టాలిన్ వాటన్నింటినీ పక్కన పెట్టి సాధారణ పౌరుడిలా వ్యవహరించారు. స్టాలిన్ వాకింగ్..సైక్లింగ్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వీటిని మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తారు.

Women falls flat for CM Stalin glamour,Asks his glamour secret

సీఎం అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్‌ కోసం వెళ్లారు. ఇక, తాజాగా మార్నింగ్ వాకింగ్ కు సాధారణ పౌరుడి తరహా లో వెళ్లారు. అక్కడ వాకింగ్ కు వచ్చిన మహిళలను చూసి 'ఎన్నమ్మా..సౌఖ్యమా' (ఏమ్మా క్షేమంగా ఉన్నారా) అంటూ పలకరించారు. సీఎంను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. జాగింగ్ చేస్తున్న వారి వద్దకు వెళ్లి వారిని కుశల ప్రశ్నలు వేసారు.

వీరిలో ఒక మహిళ.. 'మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్‌ అయ్యాను' అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. 'మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది' అంటూ మరో మహిళ ప్రశంశించారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పాలన పైన సంతోషంగా ఉన్నామంటూ మరో మహిళ సీఎంను ప్రశంసించింది. అదే సమయంలో..మరో స్థానికుడు జోక్యం చేసుకొని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నామని తన ఆకాంక్ష తెలిపారు. వెంటనే సీఎం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

అక్కడే ఉన్న మరో మహిళ 'ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం ..మార్కెండేయుల్లా ఉన్నారే' అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్‌ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు. దీనికి వెంటనే సీఎం.. ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్‌ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్‌ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary
Tamilnadu CM Stalin was taken by surprise when women had asked him to reveal the secret behind his glamour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X