కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ- 20న పార్లమెంటులో మహిళా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ !

స్వతంత్ర భారత అమృతోత్సవాల నేపథ్యంలో అమృతకాల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరుతో ఐదు రోజుల సెషన్స్ నిర్వహిస్తున్న కేంద్రం.. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తొలి రెండు రోజుల పాటు చేపట్టే కార్యక్రమాల అజెండా బయటపెట్టిన కేంద్రం.. చివరి మూడు రోజులపై సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఈ సస్పెన్స్ వీడేందుకు ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ నిర్వహిస్తోంది. ఇందులో మహిళా బిల్లు సహా అనేక సంచలన బిల్లులకు ఆమోదముద్ర వేయనున్నారు.

పార్లమెంటు ఐదు రోజుల భేటీలో భాగంగా ఎల్లుండి లోక్ సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గతంలో దశాబ్దాలుగా పార్లమెంటు ఆమోదానికి నోచుకుని మహిళా బిల్లును ఈసారి ఎలాగైనా నెగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసే అవకాశముంది. సాయంత్రం ఆరున్నర గంటలకు జరిగే కేబినెట్ భేటీలో దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

women reservation bill in parliament on sept 20, crucial union cabinet meeting evening

ఎల్లుండి పార్లమెంట్ ముందుకు వస్తుందని భావిస్తున్న మహిళా బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఈ బిల్లు ఆలస్యమైందని, ఈసారి కేంద్రం సమగ్ర చర్చ చేపట్టి ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని పలు విపక్ష పార్టీలు కోరుతున్నాయి. అయితే ఇండియాకూటమిలో అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతిస్తాయా లేదా అన్నది తేలలేదు. ప్రస్తుతం ఇండియాకూటమిలో ఉన్న ఎస్పీ,ఆర్జేడీ వంటి పార్టీలు గతంలో మహిళా బిల్లును అడ్డుకున్న చరిత్ర ఉంది.

మరోవైపు ఇవాళ సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుతో పాటు పలు బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆయా బిల్లులపై విపక్షాలు ఎలా రెస్పాండ్ అవుతాయన్నది కీలకంగా మారింది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు పెద్దగా ఇబ్బందులు లేకుండా సాగిపోయాయి. ఇవాళ కేబినెట్లో వివాదాస్పద బిల్లులకు ఆమోద ముద్ర వేస్తే మాత్రం రేపటి నుంచి విపక్షాలు నిరసనకు దిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+