Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీలో తగ్గిన మహిళల సంఖ్య.. ఈ సారి ఎంత మంది గెలిచారంటే?
Delhi Election Results 2025: ఢిల్లీలో బీజేపీ 48 స్థానాలతో అఖండ మెజారిటీ సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పడిపోయింది. ఈ సారి ఢిల్లీ అసెంబ్లీలో మహిళల సంఖ్య కూడా తగ్గింది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 8 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టగా.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు చెరో 9 మంది మహిళలకు టికెట్లు ఇచ్చాయి. బీజేపీ నిలబెట్టిన 8 మంది మహిళా అభ్యర్థులతో నలుగురు విజయం సాధించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఒకే మహిళా అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆప్ మహిళా అభ్యర్థి మరెవరో కాదు.. ఢిల్లీ సీఎం అతిషి. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల్లో 96 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 5 మంది మాత్రమే విజయం సాధించారు.
గత మూడు దశాబ్దాలుగా ఢిల్లీ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతోంది. 1993లో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. అంటే ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 4.3 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సంఖ్యలో మహిళలు 1998లో ఎన్నికయ్యారు. ఆ సంవత్సరంలో 9 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇది మొత్తం సీట్లలో 12.9 శాతం. అయితే అనంతరం మహిళా ఎమ్మెల్యేల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపించాయి.

2003లో ఏడుగురు మహిళలు అసెంబ్లీకి రాగా.. 2008, 2013లో ఆ సంఖ్య గణనీయంగా తగ్గి కేవలం ముగ్గురికి చేరుకుంది. 2015 ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు గెలిచి అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం 2020లో జరిగిన ఎన్నికల్లో 8 మంది మహిళలు గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య మళ్లీ తగ్గింది. ఈ ఎన్నికల్లో కేవలం 5 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే గెలిచి అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఇది మొత్తం సీట్లలో 7.1 శాతం. ఢిల్లీకి ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు తమ సేవలను అందించారు. 1998లో దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 1998 నుంచి 2013 వరకు దివంగత కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంగా సేవలు అందించారు. ఆప్ కు చెంది అతిషి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications