Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..!

దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయ వ్యవస్ధలో భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేసే లక్ష్యంతో గతంలో తీసుకొచ్చిన మహిళా చట్టం (Women's Reservation Act) అమలుకు మాత్రం నోచుకోలేదు. దీనికి కారణం నియోజకవర్గాల పునర్విభజన పెండింగ్ లో ఉండటమే. అయితే ఈ ప్రక్రియకు ముందే 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం పార్లమెంట్ లో వచ్చే వారమే సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో మహిళా రిజర్వేషన్లు (Women's Reservation Act)

కేంద్రం తెచ్చే తాజా చట్టం ప్రకారం దేశంలో మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుండి 816కు పెరుగుతుంది. ఇందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. వాస్తవానికి గతంలో ఆమోదించిన చట్టం ప్రకారం, కొత్త జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని తెలిపింది. కానీ దేశంలో మారుతున్న పరిస్దితుల నేపథ్యంలో దీన్ని ముందుకు జరిపేందుకు సిద్దమైంది. ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

Women s Reservation Act Govt to Implement Soon Citing 2011 Census Data
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!

పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు

కేబినెట్ ఆమోదం తర్వాత వచ్చే వారం ఈ చట్టాన్ని మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు రెండింటిలోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తుంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున ఇది ఇంకా అమలు కాలేదు. ఒకవేళ ప్రభుత్వం పునర్విభజనకు ముందే రిజర్వేషన్‌ను అమలు చేయడానికి ముందుకు వెళితే, మరో రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. ఇందుకోసం ఈ చట్టంలోని సెక్షన్ 5ను సవరించాల్సి ఉంటుంది.

Women s Reservation Act Govt to Implement Soon Citing 2011 Census Data
రికార్డుల రారాజు
రికార్డుల రారాజు

విపక్షాల మద్దతు తప్పనిసరి

రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఆర్టికల్ 368(2) ప్రకారం ఉభయ సభలలో మొత్తం సభ్యులలో మెజారిటీ, హాజరై ఓటు వేసిన వారిలో కనీసం మూడింట రెండు వంతుల ఆమోదం తప్పనిసరి. అయితే లోక్‌సభలో 240 మంది ఎంపీలు, రాజ్యసభలో 103 మంది ఎంపీలు మాత్రమే ఉన్న బీజేపీకి, ప్రతిపక్ష పార్టీల మద్దతు లేకుండా ఈ సవరణను ఆమోదించడానికి ఏ సభలోనూ మెజార్టీ లేదు. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించిన విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రాన్ని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+