టాప్-5 రైల్వే వ్యవస్థలు.. ఇండియా రికార్డ్
రైల్వే వ్యవస్థ అనేది మొదటిసారిగా ప్రారంభమైనప్పుడు కోచ్ లను గుర్రాలతో లాగేవారు. 1767లో ఇంజనీరు రేనాల్డ్స్ మొదటిసారిగా ఇనుప పట్టాలతో రైలుమార్గాన్ని రూపొందించారు. ఒకచోట నుంచి మరొకచోటకు వేగంగా ప్రయాణించాల్సిన అవసరం ఉన్న తరుణంలోనే రైలుమార్గం అవతరించింది. గుర్రపు బళ్లు, ఇతర సొంత వాహనాల్లో ధనువంతులు మాత్రమే ప్రయాణిస్తున్నారు.. సామాన్యులకెలా? అని ఆందోళన చెందుతున్న సందర్భంలోనే రైలు ఆవిర్భవించింది.
ప్రజల సామాజిక జీవనంలో వస్తున్న మార్పులు, ఉత్పత్తి అవుతున్న వస్తువులు, జీవన సరళి లాంటివి మేధావుల బుర్రలకు పదును పెట్టేలా చేశాయి. రైలు మార్గంతోపాటు ఆవిరి ఇంజన్ కూడా ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లండ్ లో మొదటిసారిగా రైల్వే వ్యవస్థ ఏర్పాటైంది. నెట్ వర్క్ పరంగా రైల్వే వ్యవస్థల్లో ఏ దేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.

1. అమెరికా- ప్రపంచంలో రైలు నెట్‌వర్క్ పరంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఈ దేశ రైలు నెట్‌వర్క్ 2,57,560 కి.మీ. అయితే అమెరికాలోని చాలా రైల్వేలు సరుకు రవాణాను ప్రధానంగా చేసుకున్నాయి.
2. చైనా- చైనా రెండో స్థానంలో ఉంది. 150,000 కిమీ కంటే ఎక్కువ నెట్‌వర్క్ ఉంది. 40,000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌తో హైస్పీడ్ రైల్వే ట్రాక్‌ల విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చైనా ఉంది.
3. రష్యా- వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. 85,600 కి.మీ రైల్వే నెట్‌వర్క్‌తో మూడో స్థానంలో నిలిచింది. జనసాంద్రత, చల్లగా ఉండే వాతావరణం వల్ల ఈ దేశం మూడోస్థానానికే పరిమితమైంది.
4. భారతదేశం- రైల్వే నెట్ వర్క్ పరంగా నాలుగో స్థానంలో నిలిచింది. పరిమాణం పరంగా 7వ స్థానాన్ని దక్కించుకుంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఈస్థాయికి చేరుకోవడం గొప్ప విజయమే. భారత రైల్వే నెట్‌వర్క్ 70,225 కిలోమీటర్లు. ట్రాక్ పొడవు 1,26,366 కిలోమీటర్లు. 71 శాతం మార్గాన్ని విద్యుదీకరించారు. ప్రతిరోజు 1.60 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల సరకులను కూడా రవాణా చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగివున్న సంస్థగా రికార్డు సృష్టించింది.
5. కెనడా- 49,422 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో 5వ స్థానంలో ఉంది. ఈ దేశంలో రైల్వేలు పూర్తిగా ప్రైవేట్ పరం. ఎక్కువ భాగం సరకు రవాణాకే ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications