సోదరుడిని చూసి కంటతడి: క్షమించాలన్న మెమన్
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కి గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. ఉరిశిక్ష అమలు ఖరారు కావడంతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో బుధవారం యాకూబ్‌ను ఆయన కుటుంబసభ్యులు కలిశారు.
యాకుబ్ తన కూతురును, కుటుంబసభ్యులను కలవాలని కోరడంతో జైలు అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా యాకుబ్ తన తన కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.

కాగా, సోదరుడు సులేమాన్‌ని చూసి యాకూబ్ మెమన్ కంటతడిపెట్టారని జైలు అధికారులు గురువారం తెలిపారు. 'నేను ఎదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి' అంటూ యాకూబ్ తన తోటి ఖైదీలకు, జైలు అధికారులకు చెప్పాడని అధికారులు పేర్కొన్నారు.
ఉరి వేసే ముందు తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదని వైద్యులకు యాకుబ్ తెలిపినట్లు వారు చెప్పారు.












Click it and Unblock the Notifications