Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ హవా.. పలు కేంద్ర కమిటీలలో పెద్దపీట

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి పార్లమెంటరీ సలహా సంఘ సభ్యుల నియామకం జరిగింది. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వివిధ సంఘాల్లో సభ్యులుగా నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులు కాగా, విజయసాయిరెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కు , మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆర్థిక శాఖ సలహా సంఘంలో చోటు దక్కించుకున్నారు . ఇక వైయస్ అవినాష్ రెడ్డికి చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ లో స్థానం దక్కింది.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సంబంధించి వివిధ సంఘాల నియమితులైన వైఎస్ఆర్సిపి ఎంపీల జాబితా

YCP MPs appointed in the Parliamentary Advisory Committees of the Union Ministries .. This is the list

1. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ - మిథున్ రెడ్డి

2. ఆర్థిక శాఖ - మాగుంట శ్రీనివాసులు రెడ్డి

3. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - విజయ సాయి రెడ్డి, వల్లభనేని బాలశౌరి

4. చిన్న,మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి

5. మహిళా శిశు సంక్షేమ శాఖ - చింతా అనురాధ

6. హోం శాఖ - గోరంట్ల మాధవ్

7. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ - రెడ్డప్ప

8. ఉక్కు శాఖ - నందిగామ సురేష్

9. విదేశాంగ శాఖ - సత్యవతి

10. రైల్వే శాఖ - ఆదాల ప్రభాకర్ రెడ్డి

11. షిప్పింగ్ - బల్లి దుర్గాప్రసాద్, తలారి రంగయ్య

12. ఆరోగ్యశాఖ - వంగా గీత

13. పశు మరియు మత్స్య శాఖ - శ్రీ కృష్ణ దేవరాయలు

14. ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ - గొడ్డేటి మాధవి

15. జల శక్తి శాఖ - బ్రహ్మానంద రెడ్డి

16. గృహ పట్టణ వ్యవహారాల శాఖ - సత్యనారాయణ

17. విద్యుత్ శాఖ - రఘురామకృష్ణంరాజు

18. అడవులు మరియు పర్యావరణ శాఖ - కోటగిరి శ్రీధర్

19. రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ - డాక్టర్ సంజీవ్ కుమార్

20. భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు - మార్గాని భరత్

21. విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

22. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ - బెల్లాన చంద్రశేఖర్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+