Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఆంటీ బెడ్ రూమ్ షేర్ ఇవ్వలేదని ఫ్రెండ్ హత్య, ఎన్ని ప్రయత్నాలు చేసినా నో చాన్స్!

బెంగళూరు/ మైసూరు/ మండ్య: భర్తతో విడిపోయి జీవిస్తున్న ఆంటీతో సహజీవనం సాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైనాడు. వాడిలో ఉండే స్పెషల్ ఏమంది, నాలో లేనిది ఏమిటి ?, నీ బెడ్ రూమ్ లో నాకు షేర్ ఇవ్వాలి అంటూ మరో యువకుడు ఆమెను వేధించాడు. తనకు శారీరక సుఖం ఇవ్వలేదని మహిళ మీద కక్ష పెంచుకున్న యువకుడు సాటి స్నేహితులతో కలిసి ఆమె ప్రియుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఆరు సంవత్సరాల నుంచి తనను కాదని వేరే వ్యక్తికి శారీరక సుఖం ఇస్తోందని, వాడు మాత్రం ఆమెతో జల్సా చేస్తున్నాడని ఆ మహిళ మీద కక్ష పెంచుకున్న యవకుడు నీ ప్రియుడిని చంపేస్తానని చాల రోజుల నుంచి బెదిరించి చివరికి సినిమా స్టైల్లో అన్నంతపని చేశాడు.

పిటపిటలాడే పిల్లల తల్లితో జల్సా

పిటపిటలాడే పిల్లల తల్లితో జల్సా

కర్ణాటకలోని మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణం తాలుకా మంటి ప్రాంతానికి చెందిన లలితశ్రీ (పేరు మార్చాం)కి వివాహం అయ్యి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే లలితశ్రీ దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఏడు సంవత్సరాల క్రితం విడిపోయారు. కుమారుడు తండ్రి దగ్గర, ఇద్దరు కుమార్తెలు లలితశ్రీ దగ్గర ఉంటున్నారు. లలితశ్రీ వేరుగా, ఆమె భర్త వేరుగా కాపురం పెట్టారు. నంజనగూడు తాలుకా హురహళ్ళి ప్రాంతానికి చెందిన ఉదయ్ (30) అనే యువకుడు లలితశ్రీకి ఆరు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యాడు.

చాన్స్ రాలేదని వీడిదోగోళ

చాన్స్ రాలేదని వీడిదోగోళ

లలితశ్రీ, ఉదయ్ ల పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరు కలిసి సహజీవనం చెయ్యాలని నిర్ణయించారు. ఉదయ్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ లు చేస్తున్నాడు. లలితశ్రీ గార్మెంట్స్ లో ఉద్యోగం చేస్తున్నది. గత ఆరు సంవత్సరాల నుంచి ఉదయ్, లలితశ్రీ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ కలిసి మంటి ప్రాంతంలో కాపురం పెట్టారు. మంటి ప్రాంతంలోనే నివాసం ఉంటున్న మోహన్ అనే యువకుడు సైతం లలితశ్రీ మీద చాలా కాలం నుంచి కన్ను వేశాడు. లలితశ్రీతో కొన్ని సంవత్సరాల నుంచి ఉదయ్ ఎంజాయ్ చేస్తున్నాడని, తనకు ఎప్పుడు అలాంటి చాన్స్ వస్తోందని, తాను ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని మోహన్ చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఆంటీకి వల

సోషల్ మీడియాలో ఆంటీకి వల

కొంత కాలం క్రితం నీతో పరిచం చెయ్యాలని, అంగీకరించాలని మోహన్ లలితశ్రీకి ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టాడు. లలితశ్రీ కూడా ఓకే చెప్పింది. అప్పటి నుంచి మోహన్, లలితశ్రీ సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి లలితశ్రీ, మోహన్ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారనే విషయం ఉదయ్ కి తెలిసినా అతను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.

ఒకేఒక్క చాన్స్ ఇవ్వాలని !

ఒకేఒక్క చాన్స్ ఇవ్వాలని !


కొన్ని నెలల క్రితం మోహన్ తనకు నీతో ఎంజాయ్ చెయ్యాలని ఉందని, తన కోరిక తీర్చాలని లలితశ్రీకి మోహన్ ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాడు. అయితే లలితశ్రీ మాత్రం పట్టించుకోలేదు. చాలా రోజుల పాటు ఫేస్ బుక్ లోనే తన కోరిక తీర్చాలని, ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని మోహన్ ఆమెను వేధించాడు. అయితే లలితశ్రీ మాత్రం మోహన్ కు లొంగలేదు. నా కోరిక తీర్చకుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్న నీ లవర్ ఉదయ్ ను చంపేస్తానని, తరువాత నేనే నీకు దిక్కు అని మోహన్ లలితశ్రీని హెచ్చరించాడు.

వాడి పిండాకూడు... ఏం చేస్తాడు ?

వాడి పిండాకూడు... ఏం చేస్తాడు ?


శారీరక సుఖం ఇవ్వాలని మోహన్ తనను వేధిస్తున్నాడని, లేదంటే నిన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లలితశ్రీ ఆమె ప్రియుడు ఉదయ్ కి చెప్పింది. బచ్చాగాడు నన్ను ఏమీ చెయ్యలేడని, నువ్వ ధైర్యంగా ఉండాలని ఉదయ్ లలితశ్రీకి ధైర్యం చెప్పాడు. అయితే మోహన్ మాత్రం ఉదయ్ ను హత్య చెయ్యాలని సమయం కోసం వేచి చూశాడు.

 హ్యాపీడేస్ అంటూ పార్టీ

హ్యాపీడేస్ అంటూ పార్టీ

ఉదయల్, లలితశ్రీ సహజీవనం చెయ్యడం మొదలు పెట్టి ఆరు ఏళ్లు పూర్తి అయ్యింది. సహజీవన వార్షికోత్సవం చేసుకుందామని నిర్ణయించిన ఉదయ్, లలితశ్రీ కొంతకాలం క్రితం మైసూరు నగరంలో షాపింగ్ చేసి అక్కడ స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశారు. తరువాత బైక్ లో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో మోహన్ లలితశ్రీ, ఉదయ్ ను అడ్డగించాడు. నేను ఎన్నిసార్లు నా కోరిక తీర్చాలని చెప్పినా నువ్వు వినలేదని, ఉదయ్ లో ఉండేదేమి, నాలో లేంది ఏమిటి అంటూ అసభ్యంగా మాట్లాడాడు. ఉదయ్, లలితశ్రీ మాత్రం మోహన్ నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయారు.

 పోటుగాడో ఎవరో నువ్వే చెప్పాలి అంటూ హత్య

పోటుగాడో ఎవరో నువ్వే చెప్పాలి అంటూ హత్య

రాత్రి మోహన్ అతని స్నేహితులతో కలిసి లలితశ్రీ, ఉదయ్ నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి తలుపులు సినిమా స్టైల్లో పగలగొట్టారు. తరువాత కత్తులు, కొడవళ్లు తీసుకుని ఉదయ్ మీద దాడి చేశారు. తీవ్రగాయలైన ఉదయ్ ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఉదయ్ మరణించాడు. ముందుగా చెప్పినట్లే ఉదయ్ ను మోహన్ చంపేశాడని లలితశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉదయ్ ని హత్య చేసిన మోహన్, అతని స్నేహితులు చివరికి కటకటాలు పాలుకావడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+