Year Ender 2023: ఎయిర్ లైనర్లకు కలిసొచ్చిన ఏడాది-ఇండిగో 100 మిలియన్ ప్రయాణికుల రికార్డు..

విమాన ప్రయాణం అంటే భయపడే ప్రయాణికులు, అరకొర ప్రయాణికులతో విమానాలు నడపలేక అష్టకష్టాలు పడుతున్న విమానయాన సంస్ధలు.. గత కొన్నేళ్లుగా భారత్ లో ఎక్కడ చూసినా ఇదే పరిస్దితి. పెరిగిన ఇంధన, నిర్వహణ రేట్లతో విమానయానరంగం కుదేలవుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా పలు ప్రోత్సాహకాలు ఇస్తోంది. కరోనా తర్వాత తిరిగి విమాన ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్ కూడా దీనికి కలిసిరావడంతో ఈ ఏడాది ఎయిర్ లైనర్లు కోలుకున్నాయి.

2023లో పలు స్వదేశీ, విదేశీ విమానయాన సంస్ధలు తిరిగి నష్టాల నుంచి కోలుకుని భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కు చెందిన స్వదేశీ విమాన యాన సంస్ధ ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా ఈ ఏడాది ఆశాజనకంగా ఫలితాలు సాధించింది. గత ఆరునెలల కాలంలోనే ఇండిగో తన నెట్‌వర్క్‌లో 20కి పైగా అదనపు అంతర్జాతీయ మార్గాలను చేర్చడం ద్వారా తన ఉనికిని మరింత విస్తరించుకుంది.

Year Ender 2023: IndiGo achieved 100 million passengers record in a year, first Indian firm

దీంతో పాటు ఇండిగో విమానయాన సంస్ధ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణీకులను తీసుకువెళ్లిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా అవతరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఓ ఏడాది కాలంలో 100 మిలియన్ ప్రయాణికుల్ని తమ గమ్య స్ధానాలకు చేర్చడం ద్వారా ఇండిగో ఈ రికార్డు నెలకొల్పింది. తద్వారా అంతర్జాతీయ స్ధాయిలో మరింత విస్తరించడంతో పాటు విమానయాన రంగ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. అలాగే ప్రపంచంలో టాప్ 10 ఎయిర్ లైన్స్ జాబితాలో చేరిందని సంస్ధ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఓవైపు ఎయిర్ ఇండియాను టాటాలు కొనుగోలు చేసి లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తుండటం, మరోవైపు స్వదేశీ ఎయిర్ లైనర్ ఇండిగో 100 మిలియన్ ప్రయాణికుల రికార్డు అందుకోవడం చూస్తుంటే గతంలో తీవ్రంగా దెబ్బతిన్న విమానయాన రంగానికి తిరిగి మంచి రోజులు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ టాప్ 10 ఎయిర్ లైనర్ల జాబితాలోకి ఇండిగో కూడా చేరడం భారత్ పేరును అంతర్జాతీయంగా ఈ ఏడాది ఇనుమడించినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+