రెండ్రోజుల్లో యోగి ఆదిత్యనాథ్‌కు పెరిగిన చాలా ఫాలోవర్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రెండో రోజుల్లోనే ఫాలోవర్స్ అనూహ్యంగా పెరిగారు. ఆయనకు యూపీలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సీఎం అయ్యాక ట్విట్టర్లో ఫాలోవర్ల సంఖ్య బాగా పెరిగింది.

శనివారం ఆయన ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య 147,000 ఉంది. ఆదివారం యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక 2,19,000కి చేరింది. సోమవారానికి ఆయన మొత్తం ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య 2,34,000కి పెరిగింది.

యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది!

Yogi Adityanath has 87k new followers on Twitter in less than two days

మరోపక్క యోగి ఆదిత్యనాథ్ ఫాలోయింగ్‌ ఖాతాలు కూడా పెరిగాయి. సీఎం కాకముందు వరకు యోగి కేవలం 28 ట్విటర్‌ ఖాతాలనే ఫాలో అవుతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన యూపీ పోలీస్‌, యూపీ ప్రభుత్వం, చీఫ్‌ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్‌ ఆఫీస్‌ వంటి మరికొన్ని ఖాతాలను యాడ్‌ చేసుకున్నారు.

మరో విషయమేమిటంటే.. యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ట్విటర్‌కి 2.79 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. కానీ ఆయన యూపీ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఖాతాలను అన్‌ఫాలో చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
From the chief priest of Gorakhnath temple to the chief minister of the most populous state in India, Yogi Adityanath has come a long way. His popularity has not only swelled on the ground but also on social media.
Please Wait while comments are loading...