యూపీ రైతుల ఖాతాల్లోకి రూ.2 లక్షల కోట్లు-యోగీ సర్కార్ రికార్డ్- ఆరేళ్లుగా రైతు ఆత్మహత్యలే లేవని వెల్లడి

యూపీలో తాను అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలే జరగలేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రైతు అనుకూల విధానాలపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ ఓ కీలక ప్రకటన చేశారు. ఇందులో ఆయన గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోలేదని యోగీ తెలిపారు. యూపీలో సహకార చక్కెర కర్మాగారాలు, సొసైటీలకు 77 ట్రాక్టరను ఇవాళ హోలీ సందర్భంగా ఆయన అందేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చెరుకు రైతులకు ఇవాళ ఓ శుభదినమని యోగీ తెలిపారు. నేరుగా వారి ఖాతాల్లోకి 2 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.

2017లో తాను అధికారంలోకి రాక ముందు యూపీలో చెరుకు రైతులు పంటల సాగుకు తగినంత తీరు, విద్యుత్ లేక పంటలు తగులబెట్టుకునే వారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్ధితి మార్చామని సీఎం యోగీ తెలిపారు. దళారుల కబంధ హస్తాల నుంచి తాము చెరుకు రైతులకు విముక్తి కల్పించామన్నారు. గతంలో చెరుకు రైతుల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసని, ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు ప్రభుత్వ అజెండాలో తొలిసారిగా చేరి ప్రభుత్వ కార్యక్రమాలతో లబ్ధి పొందడం ప్రారంభించాడన్నారు. గతంలో వడ్డీ వ్యాపారులపై ఆధారపడిన ప్రతి రైతు ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్, కిసాన్ బీమా యోజన, వ్యవసాయ నీటిపారుదల పథకం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో ప్రయోజనం పొందుతున్నారన్నారు.

yogi adityanath regime transfer 2 lakh crores to sugarcane farmers accounts-says no farmer suicides

ప్రస్తుతం రాష్ట్రంలోని 2.60 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని సద్వినియోగం చేసుకుంటున్నారని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. గత మూడున్నరేళ్లలో రూ.51,000 కోట్లను వారి ఖాతాల్లోకి బదలాయించామన్నారు. రైతు కేవలం రైతు మాత్రమేనని, కులం, మతం, మతం లేవని యోగి స్పష్టం చేశారు, 2017కి ముందు రాష్ట్రంలో కరెంటు లేదు, సాగుకు నీరు లేదని, ఇప్పుడు తాము సాగునీరు అందించామన్నారు. 22 లక్షల హెక్టార్ల భూమికి సౌకర్యాలు. గతంలో నీరు, ఎరువులు మరియు ఉత్పత్తికి సరైన మార్కెట్ ధర లేకపోవడం వల్ల వ్యవసాయాన్ని నష్టపోయే వ్యాపారంగా పరిగణించేవారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+