వెంకయ్యకు ఓటు వేసిన అనంతరం, రాజీనామా చేసిన యోగి
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీగా అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయి.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీగా అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యేదాకా యోగి రాజీనామా చేయవద్దని ముందే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు.
గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానం నుంచి ఐదుసార్లు ఎన్నికైన ఆయన ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసిన అనంతరం తన రాజీనామాను సమర్పించారు.

ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆదిత్యనాథ్ రాష్ట్ర చట్టసభల్లోని ఒకటైన శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.
ఇప్పటికే శాసనమండలిలో ఎస్పీకి చెందిన ముగ్గురు, బీఎస్పీకి చెందిన ఒకరు వైదొలిగారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లకుండా తన ఇద్దరు డిప్యూటీ సీఎంలు దినేశ్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి ఆదిత్యనాథ్ ఆ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications