దత్తత: ఎమ్మెల్యే, అధికారులకు యోగి ఆదిత్యనాథ్ బాధ్యత

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ప్రజాప్రతినిధులు, అధికారులు దత్తత తీసుకోవాలని యూపీ సీఎం యోగి పిలుపునిచ్చారు.పలు నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయన్నారు.

లక్నో: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ప్రజాప్రతినిధులు, అధికారులు దత్తత తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చారు.

పలు నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయని, దీంతో స్థానికంగా ఉన్న చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారని ఆయన తెలిపారు.

కాబట్టి ఆయా పాఠశాలలను పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో ఒక్కో పాఠశాలను దత్తత తీసుకుని, పునరుద్ధరించాలని యోగి కోరినట్లు బిజెపి ప్రతినిధి చంద్రమోహన్‌ తెలిపారు.

Yogi Adityanath tells MLAs to adopt broken schools to revamp education system

రాష్ట్రంలో అమలవుతోన్న విద్యా విధానంపై ముఖ్యమంత్రి యోగి ఆధ్వర్యంలో అధికారులు చర్చలు జరిపారు. ప్రభుత్వం అందించే సహకారం ప్రతి ఒక్కరికీ అందజేయాలని ఈ క్రమంలోనే పాఠశాలలను పునరుద్ధరించాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు చంద్రమోహన్‌ తెలిపారు.

పాఠశాలలకు చిన్నారులు తరలి రావాలంటే ముందుగా ఆయా పాఠశాలలను పునరుద్ధరించాలని ఇందుకు గాను ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు కనీసం ఒక్క పాఠశాలనైనా దత్తత తీసుకుని మెరుగుపరచాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+