మీరు బతికి ఉన్నారంటే.. మోడీ వల్లే: బీహర్ మంత్రి కామెంట్స్
అధినేతలను పొగడటం కామనే.. కానీ మీరు బతికి ఉన్నది.. మా నేత వల్లే అనే కామెంట్స్ ఎవరూ చేసి ఉండరు. కానీ బీహర్ మంత్రి, బీజేపీ నేత ఒక అడుగు ముందుకు వేశారు. అవును కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాక్సిన్ రూపొందించి.. అందరికీ ఉచితంగా అందజేసిన సంగతి తెలిసిందే. అందువల్లే ఇప్పుడు కేసులు లేవు. మరీ ఆ విషయాన్ని బీహర్ మంత్రి గుర్తుకు చేశారు.
ప్రధాని మోడీని బిహార్ మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్ ఆకాశానికి ఎత్తారు. ప్రజలు ఇప్పుడు బతికున్నారంటే అది మోడీ చలవే అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు అందించి ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. ముజఫర్‌పుర్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జులై 17నాటికి దేశంలో 200 కోట్ల కరోనా టీకా డోసులు పంపణీ చేశారు. అంతేకాదు 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆదివారం కొత్తగా 19,673 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 39 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,43,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 204 కోట్ల 25లక్షల 69వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.
దేశంలో ఇప్పుడు కరోనా కేసులు వస్తోన్న నామమాత్రంగానే వస్తున్నాయి. ఇప్పుడు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. దోమల బెడదను అరికట్టాలని జనం కోరుతున్నారు.












Click it and Unblock the Notifications