ఎమ్మెల్సీ కొడుకు దుర్మార్గం: ఓవర్‌టేక్ చేశాడని చంపేశాడు
గయ: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని కారణంతో ఓ యువకుడిని కాల్చి చంపేశాడు ఓ రాజకీయ నాయకుడు. ఈ దారుణం గయ వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఆదిత్య సచ్ దేవా(25) అనే యువకుడు గయ సమీపంలో జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మనోరమా దేవి-బిండీ యాదవ్ దంపతుల కొడుకు కారును ఓవర్ టేక్ చేస్తూ వెళ్లాడు. దాంతో అతడు తన వద్ద ఉన్న రైఫిల్‌తో కాల్చడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, దీనిపై బిండీయాదవ్ స్పందిస్తూ.. తొలుత ఆ యువకుడికి తన కుమారుడికి మధ్య గొడవ జరిగిందని, తనను తాను రక్షించుకునేందుకు తన కుమారుడు తుపాకీ బయటకు తీశాడని, పొరపాటున అది పేలి ఆ యువకుడు చనిపోయాడని చెప్పారు.

మరో జేడీయూ నేత స్పందిస్తూ.. ఏ ఒక్కరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని అలా తీసుకుంటే శిక్ష పడుతుందని, అలాంటి రక్షించాలని చూడటం కూడా నేరమవుతుందని చెప్పారు.
కాగా, మృతుడి స్నేహితుడు మాట్లాడుతూ.. తాము ఓవర్ టేక్ చేస్తున్న సమయంలోనే కాల్పులు జరిపారని, దీంతో ఆదిత్య మృతి చెందాడని తెలిపాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బిండి యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications