ప్రేయసి ఫ్యామిలీ అతన్ని ముక్కలుగా నరికింది

అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి క్రూర జంతువులకు వారు ఆహారంగా వేశారు. అమ్మాయి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. బస్తీ జిల్లాలోని చతౌనా గ్రామానికి చెందిన సుభాషథ్ (20) అనే యువకుడు పక్క గ్రామం అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరు తరుచుగా కలుసుకోవడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు కనిపెట్టారు.
ఓ రోజు కుటుంబ సభ్యులు అమ్మాయిని ఇంట్లో నిర్బంధించారు. దాంతో రాత్రిపూట కుటుంబ సభ్యులంతా గాఢనిద్రలో ఉండగా ఆ ఇంటికి యువకుడు వెళ్లి రావడం సాగిస్తూ వచ్చాడు. ఆ ఇంట్లో సుభాష్ సమయం గడుపుతూ రాసాగాడు. ప్రహరీగోడ దూకి ఇంట్లోకి ప్రవేశిస్తూ వచ్చాడు.
ఆదివారం రాత్రి ఆ ఇంటికి వెళ్లిన సుభాష్ ఇక వెనక్కి తిరిగి రాలేదు. సోమవారం సాయంత్రం అమ్మాయి తన ప్రియుడి బంధువుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆదివారం రాత్రి చప్పుడుకు అమ్మాయి తల్లి లేచి సుభాష్‌ను పట్టుకుంది. ఆమె తన కుమారుడు కన్నయ్యను లేపింది. అతను ఇతర కుటుంబ సభ్యులను పిలిచాడు. వారంతా కలిసి అతన్ని చంపేసి ముక్కలుగా నరికి జంతువులకు ఆహారంగా వేశారు.












Click it and Unblock the Notifications