Youtube reporter: యూట్యూబ్ ను అడ్డం పెట్టుకుని కిడ్నాప్, జస్ట్ రూ. 20 లక్షలు, క్లైమాక్స్ లో !
బెంగళూరు: యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చక్కగా వీడియోలు, చిన్నచిన్న స్టోరీలు చేసుకుంటూ యూట్యూబ్ లో పోస్టు చేసి లైక్ లు సంపాధించుకోకుండా ఓ యూట్యూబర్ క్రిమినల్ అవతారం ఎత్తాడు. రౌడీషీటర్లతో లింక్ పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ క్రిమినల్ అవతారం ఎత్తాడు. ఫేమస్ ఫుడ్ తయారు చేసే కంపెనీ నిర్వహకులను కిడ్నాప్ చేసి రూ. 20 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు, రౌడీలు వేసిన మాస్టర్ ప్లాన్ కు రివర్స్ గేర్ వేసిన పోలీసులు పక్కాప్లాన్ తో నిందితులను అరెస్టు చేసి కిడ్నాపర్లను అరెస్టు చేశారు. ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదు అయిన రౌడీషీటర్ తో ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ తోడు కావడం, వ్యాపారులను కిడ్నాప్ లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం ఐటీ హబ్ లో కలకలం రేపింది.
Illegal
affair:
ప్రియుడికి
రిజర్వేషన్,
భర్తకు
వెయిటింగ్
లిస్ట్,
తట్టుకోలేక
థ్రిల్లర్
సినిమా
స్కెచ్
!

యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్
ఐటీ హబ్ బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ లో నివాసం ఉంటున్న సంతోష్ అనే యువకుడు ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి అతనే రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకున్న సంతోష్ ఉద్దరగా డబ్బులు సంపాధించాలని క్రిమినల్ స్కెచ్ లు వేస్తున్నాడని వెలుగు చూసింది.

ఫేమస్ కంపెనీ
బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ లో సాయి ఫుడ్ ప్రై.లి. కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలో వివిద రకాల ఆహార పదార్థాలు తయారు చేసి బెంగళూరు నగరంతో సహ ఇతర ప్రాంతాలో విక్రయిస్తున్నారు. సాయి ఫుడ్ కంపెనీ నిర్వహకులను బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చెయ్యాలని స్కెచ్ వేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ఆ విషయం రౌడీషీటర్ కుళ్లి రమేష్ కు చెప్పాడు.

కంపెనీలో నానా హంగామా
యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ సంతోష్, రౌడీషీటర్ కుళ్లి రమేష్ తదితరులు సాయి ఫుడ్ కంపెనీ మీద పడ్డారు. కాలం చెల్లిపోయిన ఆహార పదార్థాలు నిల్వ చేసి వాటిని విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా ?, ఈ తతంగం మొత్తం మేము యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని వెళ్లి కంపెనీ నిర్వహకులను బెదిరించారు.

ఏమాత్రం చిక్కలేదు
సాయి ఫుడ్స్ లో కాలం చెల్లిపోయిన ఆహార పదార్థాలు ఏమాత్రం చిక్కకపోవడంతో యూట్యూబర్ సంతోష్ తో పాటు రౌడీసీటర్ కుళ్లి కూడా కంగుతిన్నారు. తరువాత ఎలాగైనా డబ్బులు వసూలు చెయ్యాలని సాయి ఫుడ్స్ కు చెందిన ఇద్దరిని కిడ్నాప్ చేసి రూ. 20 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని వారి కుటుంబ సభ్యులను బెదిరించారు.

పోలీసులు రివర్స్ స్కెచ్
యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు సంతోష్, రౌడీషీటర్ కుళ్లి రమేష్ వేసిన మాస్టర్ ప్లాన్ కు బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ పోలీసులు రివర్స్ గేర్ వేశారు. పక్కాప్లాన్ తో యూట్యూబర్ సంతోష్, రౌడీషీటర్ కుళ్లి రమేష్, దుర్గేష్, హరీష్, అరవింద్, వివేక్ అనే నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదు అయిన రౌడీషీటర్ రమేష్ తో ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ సంతోష్ తోడు కావడం, వ్యాపారులను కిడ్నాప్ లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం ఐటీ హబ్ లో కలకలం రేపింది.
Recommended Video

వీడికి ఏం పోయేకాలం వచ్చిందో
యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చక్కగా వీడియోలు, చిన్నచిన్న స్టోరీలు చేసుకుంటూ యూట్యూబ్ లో పోస్టు చేసి లైక్ లు సంపాధించుకోకుండా యూట్యూబర్ సంతోష్ క్రిమినల్ అవతారం ఎత్తాడు. రౌడీషీటర్ కుళ్లి రమేష్ తో లింక్ పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ సంతోష్ ఇప్పుడు క్రిమినల్ అవతారం ఎత్తి అడ్డంగా బుక్కైపోయాడు.